గ్రాండ్ గా లాంచ్ కానున్న సమంతా కొత్త సినిమా

Thursday,October 25,2018 - 01:28 by Z_CLU

మరో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో నటించనుంది సమంతా. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది స్యామ్.  కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని త్వరలో అఫీషియల్ గా లాంచ్ చేసే ప్రాసెస్ లో ఫిల్మ్ మేకర్స్.

ఒక ముసలావిడ సడెన్ గా యంగ్ అమ్మాయిలా మారడం, ఆ తరవాత జరిగే పరిణామాల నేపథ్యంలో తెరకెక్కనుందీ ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ఆ ముసలావిడకి యంగ్ వర్షన్ లా కనిపించనుంది సమాంత.

ఇప్పటికే తెలుగు నేటివిటీకి కి తగ్గట్టుగా, స్క్రిప్ట్ డెవెలప్ చేసుకున్న నందిని రెడ్డి, ఈ సినిమాలో ముసలావిడ క్యారెక్టర్ కోసం సీనియర్ నటిని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉందట. కరెక్ట్ టైమ్ చూసుకుని డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, సమాంత కి ఓల్డ్ వర్షన్ ఎవరా అనేది త్వరలో రివీల్ చేస్తారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్నారు.