గీతా ఆర్ట్స్ లో ఆ ఇద్దరు దర్శకులు

Thursday,October 25,2018 - 03:47 by Z_CLU

ప్రతీ బ్యానర్ లో కొందరు దర్శకులు కొన్ని నెలల పాటు కథా చర్చలు జరుపుతుండటం సహజమే.. అయితే గీతా ఆర్ట్స్ లో మాత్రం కొన్నేళ్లుగా ఇద్దరు డైరెక్టర్స్ స్ట్రక్ అయిపోయారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు… ఒకరు శ్రీకాంత్ అడ్డాల, మరొకరు బొమ్మరిల్లు భాస్కర్. ఇద్దరూ కథలు రెడీ చేసి సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ గా ఉన్నారు కానీ ఇప్పటివరకూ ఈ సినిమాలపై ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు.

శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ తర్వాత గీతా ఆర్ట్స్ కి ఓ సినిమా చేయాల్సి ఉంది. అప్పటి నుండి ఈ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలోస్తూనే ఉన్నాయి… కానీ శ్రీకాంత్ అడ్డాల సినిమా గురించి గీతా ఆర్ట్స్ నుండి ఒక్క అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.

ఇక బొమ్మరిల్లు భాస్కర్ కూడా అంతే గీతా ఆర్ట్స్ నుండి ఎప్పుడో అడ్వాన్స్ అందుకున్నాడు. కానీ సినిమా మాత్రం ఎందుకో కుదరట్లేదు. మెగా హీరోలతోనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమా చేయాలనీ భావిస్తున్న అల్లు అరవింద్ ఈ దర్శకులను ఏ హీరోలకి ఎటాచ్ చేస్తాడో.. అసలు ఈ సినిమాలకు సంబంధించి అనౌన్స్ మెంట్ ఎప్పుడు చేస్తాడో చూడాలి.