2.0 బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

Sunday,October 22,2017 - 10:06 by Z_CLU

ఈ మాట అంటోంది ఎవరో కాదు, మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. అవును.. తన తాజా చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అమీర్ ఖాన్.. 2.0 సినిమా స్టోరీ తనకు తెలుసని, అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నాడు.

2.0 సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా షేర్ చేసుకున్నాడు అమీర్. నిజానికి 2.0 ప్రాజెక్టు నుంచి రజనీకాంత్ తప్పుకోవాలని భావించారట. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. 2.0లో నటించాల్సిందిగా అమీర్ కు సూచించారట. కానీ ఈ ప్రాజెక్టులో రజనీకాంత్ ను తప్ప తనతో పాటు మరే హీరోను ఊహించుకోలేకపోయానని తెలిపాడు అమీర్. అందుకే 2.0లో నటించలేదన్నాడు.

తాజాగా 2.0 షూటింగ్ కంప్లీట్ అయింది. ముంబయిలో ఓ పాట షూటింగ్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈనెల 27న 2.0 ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరగనుంది. దుబాయ్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయబోతున్నారు.