'మహానటి' కోసం యాక్టర్స్ గా మారిన డైరెక్టర్స్...

Sunday,October 22,2017 - 09:20 by Z_CLU

కీర్తి సురేష్ సావిత్రి క్యారెక్టర్ ప్లే చేస్తున్న ‘మహానటి’ సినిమాలో మరో ఇద్దరు దర్శకులు ఆడ్ అయ్యారు. ఇప్పటికే మోహన్ బాబు, దుల్కర్ సల్మాన్, సమంత, విజయదేవరకొండ, షాలిని పాండే వంటి నటీ నటులతో అంచనాలు పెంచేస్తున్నఈ సినిమా కోసం ఓ ఇద్దరు దర్శకుడు నటులుగా మారారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో దర్శకుల పాత్రలను పోషించబోతున్నారు క్రిష్, తరుణ్ భస్కర్.

ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. కీర్తి సురేష్, మోహన్ బాబు,దర్శకుడు క్రిష్ , తరుణ్ భాస్కర్ లపై ‘మాయ బజార్’ సీక్వెన్స్ ను షూట్ చేస్తుంది యూనిట్. సినిమాకు హైలైట్ గా నిలవనున్న ఈ సీన్స్ లో ఎస్.వి.రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తుండగా, మాయాబజార్ దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ , ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాస్ పాత్రలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ నటిస్తున్నాడు.

తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ నిర్మిస్తుంది.