ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.

Friday,September 08,2017 - 07:24 by Z_CLU

ఇటీవల కాలంలో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్న చిన్న చిత్రం “పెంపక్” (ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం). థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరు తో కలిసి స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చంద్రకాంత్-రాధికా మెహరోత్రా-పల్లవి డోరా హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న “పెంపక్” ఫస్ట్ సింగిల్ ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్ రిలీజ్ చేయగా.. రెండో పాటను మరో ప్రముఖ దర్శకులు మారుతి విడుదల చేశారు. మూడో పాటను బిగ్ ఎఫ్ ఎంలో లాంచ్ చేశారు.

గోవర్ధన్ దర్శకత్వంలో హీరో చంద్రకాంత్, హీరోయిన్స్ రాధికా మెహరోత్రా, పల్లవి డోరా నటించిన  ఈ సినిమా  నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది !!!

Release Date : 20171117