'సాయి ధరమ్ తేజ్' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,February 28,2017 - 06:07 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా ‘విన్నర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు… ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించాడు.. ఆ విశేషాలు తేజ్ మాటల్లోనే…

 

మంచి రెస్పాన్స్

ఇటీవలే రిలీజ్ అయిన విన్నర్ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.. సినిమా బాగా రన్ అవుతుంది. అందుకే మీడియా ద్వారా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలనుకుంటున్నా.. సినిమాను విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి నా థాంక్స్. ముఖ్యంగా మెగా ఫాన్స్ కి స్పెషల్ గా చెప్పాలి…చాలా మంది కాల్ చేసి సినిమా గురించి సంతోషంగా మాట్లాడారు…

 

డాన్స్ చేయకపోవడానికి రీజన్ అదే 

ఈ సినిమా రిలీజ్ తరువాత డాన్స్ తగ్గిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అది నిజమే ఈ సినిమాలో డాన్స్ తో ఎంటర్టైన్ చేయడం కుదరలేదు… ఫోకస్ పెట్టలేదని కాదు కానీ టైం కుదరలేదు. అనుకోని కారణాల వల్ల డాన్స్ తో మెప్పించడం కుదరలేదు… నెక్స్ట్ టైం కచ్చితంగా డాన్స్ తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తా….

అవన్నీ పట్టించుకోను

నిజానికి కథ నచ్చితే సినిమా చేసేస్తా.. రిలీజ్ అయ్యాక ప్రొడ్యూసర్స్ సంతోషంగా ఉన్నారా.. అని మాత్రమే ఆలోచిస్తా.. మిగతా కలెక్షన్స్, ట్రేడ్ రిపోర్ట్ లాంటివి పట్టించుకోను…

 

4 సార్లు పడ్డాను..

ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకునే ప్రాసెస్ లో గుర్రాన్ని లొంగదీసుకునే టప్పుడు ఓ 4 సార్లు పడ్డాను…పడిన ప్రతీ సారి మా అమ్మ గుర్తొచ్చింది.. కానీ పడిన ప్రతిసారి 1 గంట సేపు రిలాక్స్ అయి మళ్ళీ ట్రై చేశాను.. కానీ దాని వల్ల నాకు మంచి అనుభవం వచ్చింది….

 

ప్రెజర్ ఫీలవ్వను

ఫాన్స్ నుంచి ఎప్పుడు ప్రెజర్ ఫీలవ్వను. కథ వినేటప్పుడు ఎంటర్టైనింగ్ గా ఉందా..? జనాలకి నచ్చుతుందా..? వాళ్ళు పెట్టిన డబ్బులకి హ్యాపీ గా ఫీలవుతారా… అని మాత్రమే ఆలోచిస్తా…

 

ప్రెజెంట్ చేసే విధానం కుదరలేదు

నిజానికి ‘తిక్క’ సినిమా కథ నాకు చెప్పినప్పుడు చాలా ఎంటర్టైనింగ్ గా కామెడీ గా అనిపించింది. బట్ సినిమా ప్రెజెంట్ చేసేటప్పుడే కొన్ని చేంజెస్  జరిగి అనుకున్న అవుట్ పుట్ రాలేదు …

రకుల్ ని  అలాగే చూస్తా..

రకుల్ తో ఈ సినిమా చేయడం హ్యాపీ గా ఉంది. రకుల్ నాకు మంచి ఫ్రెండ్. మా ఇద్దరికీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది… సో రకుల్ ని ఒక హీరోయిన్ గా ఫీలవ్వలేదు. జస్ట్ ఫ్రెండ్లీ గా కలిసి వర్క్ చేశాం…

 

ఆయనతో రెండో సారి

జగపతి బాబు గారితో వర్క్ చేయడం ఇది రెండో సారి. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన ని చూసి యాక్టర్ గా చాలా నేర్చుకున్నాను.. ఈ సినిమా విషయంలో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనతో ఓ కొడుకు లాగే ఫీల్ అయి చేశాను… అందుకే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెప్తుంటే సంతోషంగా ఉంది.

 

నా మీద ఖర్చు పెట్టలేదు

ఈ సినిమాను మా ప్రొడ్యూసర్స్ చాలా పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. కానీ అది నా మీద పెట్టలేదు.. కేవలం కథ డిమాండ్ మేరకే భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించారు… కథ మీద ఖర్చుపెట్టారు కాబట్టి చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా…ఇలాంటి ప్రొడ్యూసర్స్ మరిన్ని గ్రాండ్ హిట్స్ అందుకోవాలని ఆశిస్తున్నా…

 

మా అందరికీ ఇన్స్పిరేషన్

నిజంగా చిరంజీవి గారిని ‘ఖైదీ 150’ సినిమాలో వయసు కనబడకుండా అదే ఎనర్జీతో యాక్ట్ చేసి మా యంగ్ జెనరేషన్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. 3 సార్లు చూసా.. ‘రత్తాలు’,’అమ్మడు కుమ్ముడు’ సాంగ్స్ కి థియేటర్ లో  నిలబడి డాన్సులేసేశా…

 

కంటెంట్ సేమ్

కమర్షియల్ సినిమాలో కంటెంట్ ఎప్పుడు ఒకేలా  ఉంటుంది. నిజానికి కమర్షియల్ ఫార్మేట్ అంటేనే అది. ఆ బౌండరీస్ లో ఉంటూనే సినిమాని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశామా..లేదా అనేదే ముఖ్యం. ఆ విషయంలో గోపి అన్నని మెచ్చుకోవాల్సిందే.. ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాడు…

 

వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ నటించా

ఈ సినిమాలో పద్మగా వెన్నెల కిశోర్, సింగం సుజాత గా పృథ్వి గారు, పీటర్ హెయిన్స్ గా ఆలీ అన్న బాగా నవ్విస్తున్నారు. నిజానికి వాళ్ళు సెట్స్ లో ఉన్నప్పుడే నాకు నవ్వు ఆగేది కాదు.. నేనైతే ఆఫ్ స్క్రీన్ కూడా  వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశా.

కేవలం 15 నిమిషాలే

నక్షత్రం సినిమాలో నేను కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తాను. ఒక సాంగ్ ఉంటుంది. కృష్ణవంశీ గారితో వర్క్ చేయడం హ్యాపీ గా ఉంది…

 

ఇంకో నెలలో స్టార్ట్ అవుతుంది

ప్రెజెంట్ బి.వి.ఎస్.రవి గారి డైరెక్షన్ లో ‘జవాన్’ సినిమా చేయబోతున్నా. ఇటీవలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకో నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రెజెంట్ ఆ సినిమా కోసం వర్కౌట్ చేస్తున్నా..

ఆ సినిమా డిస్కర్షన్ వరకూ వచ్చింది

కళ్యాణ్ రామ్ గారి తో చేయాలనుకున్న సినిమా డిస్కర్షన్ వరకూ వచ్చింది..కానీ కథ వరకూ వచ్చే సరికి ఇంకా కుదరలేదు…ప్రస్తుతానికైతే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు…

 

నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తా

నిజానికి తమిళ్ లో సినిమా చేయొచ్చు గా అని అడుగుతున్నారు. ఆ ఆలోచన ఉంది. పైగా నాకు తమిళ్ కూడా వచ్చు, కాకపోతే నేను హీరో అయి 2 ఇయర్స్ మాత్రమే అవుతుంది. ఈ ఇయర్ కూడా ఇక్కడే ఫోకస్ చేసి నెక్స్ట్ ఇయర్ దాని గురించి ఆలోచిస్తా…

 

ఆ వార్త లో నిజం లేదు

నిజానికి వినాయక్ గారితో సినిమా చేయబోతున్నాననే వార్తలో నిజం లేదు…రెండు మూడు సార్లు కలిసాను కానీ కథ గురించి కానీ, సినిమా గురించి మా మధ్య ఎలాంటి డిస్కర్షన్ జరగలేదు..ప్రస్తుతానికి అలాంటిదేం లేదు. కానీ ఛాన్స్ వస్తే  ఖచ్చితంగా ఆయనతో చేస్తా….

 

సండే అమ్మ వంటే

నిజానికి ప్రతీ రోజు డైట్ తీసుకుంటూ ఇంట్లో ఫుడ్ మిస్ అవుతుంటా. కానీ సండే మాత్రం మా అమ్మ చేసిన వంట తినాల్సిందే..ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా అన్నం, పప్పు, ఆవకాయ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా….