మరో రీమేక్ లో వరుణ్ తేజ్ ?

Sunday,February 03,2019 - 04:26 by Z_CLU

ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘జిగర్తాండ’ రీమేక్ లో నటిస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొన్నటి వరకూ బన్నీ రీమేక్ చేస్తాడనుకున్న ‘సోను కే టీటు కీ స్వీటీ’ అనే హిందీ సినిమాను ఇప్పుడు వరుణ్ తేజ్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ పేరు బయటికి రాలేదు కానీ వరుణ్ ఈ సినిమా చేయడం కన్ఫర్మ్ అంటున్నారు.

ఈ సినిమాను టి-సిరీస్ తో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా అల్లు అరవింద్ నిర్మిస్తాడని సమాచారం. త్వరలోనే ఈ రీమేక్ సినిమాకు సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.