'సరసుడు' 

Monday,September 11,2017 - 12:04 by Z_CLU

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో శింబు, అందాల తారలు నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్‌లో ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్‌ సమర్పణలో శింబు సినీ ఆర్ట్స్‌ అండ్‌ జేసన్‌రాజ్‌ ఫిలింస్‌ బేనర్స్‌పై పాండిరాజ్‌ దర్శకత్వంలో తమిళ్‌, తెలుగు భాషల్లో టి.రాజేందర్‌ నిర్మించిన చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రం తమిళంలో ‘ఇదు నమ్మ ఆళు’ పేరుతో రిలీజై 27 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి శింబు కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలిచింది. శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత తెలుగులో రిలీజవుతున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. శింబు, నయనతార ప్రేమించుకొని బ్రేక్‌అప్‌ అయిన చాలాకాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరికీ కథ బాగా నచ్చి చేసిన చిత్రం ఇది. వాళ్లిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అన్నీ చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే విధంగా ఈ చిత్రం వుంటుంది. శింబు సోదరుడు టి.ఆర్‌. కురళరసన్‌ అందించిన ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులో సెప్టెంబర్‌ 15న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.  శింబు సినీ ఆర్ట్స్‌లో ‘కుర్రాడొచ్చాడు’ సినిమా తర్వాత డైరెక్ట్‌గా రిలీజ అవుతున్న తెలుగు సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్‌ 8న గ్రాండ్‌గా రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి చాలా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను” అన్నారు.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత: టి.రాజేందర్‌ ఎంఎ, సంగీతం: టి.ఆర్‌.కురళ్‌అరసన్‌, కెమెరా: బాలసుబ్రమణ్యం, ఎడిటింగ్‌: ప్రవీణ్‌-ప్రదీప్‌, ఆర్ట్‌: ప్రేమ్‌ నవాజ్‌, కొరియోగ్రఫీ: సతీష్‌, రచనా-సహకారం: బోస్‌ గోగినేని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: వెంకట్‌ కొమ్మినేని, కో-ప్రొడ్యూసర్‌: శ్రీమతి ఉషా రాజేందర్‌, నిర్మాత: టి.రాజేందర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌.

Release Date : 20170915