Major Movie - షూటింగ్ లో సరికొత్త రికార్డ్

Sunday,October 11,2020 - 01:14 by Z_CLU

అడివి శేష్ హీరోగా ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న ‘Major’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి నిన్న 18 గంటల పాటు కంటిన్యూ గా వర్క్ చేసింది యూనిట్. విరామం లేకుండా ఎన్ని గంటలు హార్డ్ వర్క్ చేసిన టీంను మెచ్చుకుంటూ హీరో Adivi Sesh సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో తెలుగు, హిందీ బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను Sony Pictures, GMB Entertainments సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్నఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది.