Review - అడివి శేష్ 'మేజర్'

Friday,June 03,2022 - 01:53 by Z_CLU

Movie Review – Adivi Sesh ‘Major’

నటీ నటులు : అడివి శేష్, శోభితా ధూలిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు

కెమెరా : వంశీ పచ్చి పులుసు

సంగీతం : శ్రీచరణ్ పాకాల

మాటలు : అబ్బూరి రవి

నిర్మాణం : సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్‌, జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

నిర్మాతలు : మహేష్ బాబు , సోనీ పిక్చర్స్

సహా నిర్మాతలు : అడివి శేష్, శ‌ర‌త్ చంద్ర‌

దర్శకత్వం : శశి కిరణ్ తిక్క

నిడివి : 149 నిమిషాలు

విడుదల తేది : 3 జూన్ 2022

 

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆదరంగా తెరకెక్కిన ‘మేజర్‘ ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రీమియర్ షోలతో హంగామా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ బయోపిక్స్ లో ఒకటిగా నిలిచిందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూసివ్ రివ్యూ.

adivi sesh major movie

కథ :

చిన్నతనం నుండి సోల్జర్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సందీప్ (అడవి శేష్) తండ్రికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆర్మీలో జాయిన్ అవుతాడు. ట్రైనింగ్ లో ఉండగానే ప్రియురాలు ఈషా(సయీ మంజ్రేకర్) ని పెళ్లి చేసుకుంటాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎన్ ఎస్ జీ స్పెషల్ ట్రైనింగ్ ఆఫీసర్ గా భాద్యత స్వీకరిస్తాడు.

అనుకోకుండా టెర్రరిస్టులు ముంబైని ఎటాక్ చేసి తాజ్ హోటల్ ని తమ ఆదీనంలోకి తీసుకుంటారు. ఆ సమయంలో తన టీంతో కలిసి మేజర్ సందీప్ చేసిన మిషన్ ఏంటి ? ఈ మిషన్ లో భాగంగా తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సోల్జర్ సందీప్ ప్రజలను ఎలా కాపాడాడు ? అనేది మిగతా కథ.

 

నటీ నటుల పనితీరు :

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ ఒదిగిపోయి నటించాడు. చాలా సందర్భాలో శేష్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో తన నటనతో మెప్పించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఈషా పాత్రలో సయీ మంజ్రేకర్ మంచి నటన కనబరిచింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. శోభిత దూళిపాల తన పాత్రకు న్యాయం చేసింది. సందీప్ తల్లిదండ్రుల పాత్రలకి ప్రకాష్ రాజ్ , రేవతి పూర్తి న్యాయం చేశారు. మురళి శర్మ మిగతా నటీ నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీ చరణ్ పాకాల గురించి.  నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లను తన స్కోర్ తో బాగా ఎలివేట్ చేసి సినిమాకు వెన్నుముకలా నిలిచాడు. వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా చూపించాడు. ఆర్ట్ వర్క్ బాగుంది. వినయ్ కుమార్ , పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది కానీ కొన్ని డ్రాగ్ అనిపించే సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చనిపించింది.

అబ్బూరి రవి అందించిన మాటలు కొన్ని సన్నివేశాలకు బలం చేకూర్చాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే సహజమైన మాటలు ఆకట్టుకున్నాయి. రెండో భాగంలో శేష్ చెప్పిన సింగిల్ లైన్ డైలాగ్ కి విజిల్స్ పడ్డాయి. శశి కిరణ్ తిక్కా మరోసారి తన ప్రతిభ రుజువు చేసుకున్నాడు.  తనకున్న ఒకే ఒక్క సినిమా అనుభవంతో ఈ బయోపిక్ ని దర్శకుడిగా బాగానే హ్యాండిల్ చేశాడు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

Adivi Sesh’s Pan India Film Major Theatrical Trailer On May 9th

జీ సినిమాలు సమీక్ష :

ఎవరి బయోపిక్ తీసుకున్నా అందులో సినిమాగా చూపించే కథా వస్తువుని పసి గట్టి దాన్ని పెర్ఫెక్ట్ గా స్క్రీన్ పైకి తీసుకురావడం చాలా కష్టమైన విషయం. ఏ మాత్రం తేడా కొట్టినా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ చెందుతారు. ఇక అడివి శేష్ , శశి కిరణ్ తిక్కా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథను తీసుకొని దాన్ని ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కించి మెప్పించారు.

బయోపిక్ సినిమాల్లో ఏం చూపించాలి దేన్ని హైలైట్ చేయాలి ఎలాంటి సీన్స్ రాసుకోవాలి ఇవి చాలా కీలకం. వీటన్నిటి మీద శేష్ అండ్ శశి బాగా వర్క్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో సందీప్ చైల్డ్ హుడ్ ఎపిసోడ్ , లవ్ ట్రాక్, మదర్ సెంటిమెంట్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి కాస్త స్లో నెరేషన్ తో సినిమాను ముందుకు నడిపించారు. దర్శకుడు కథలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు. ఇక అసలు కథ మొదలయ్యాక  ముంబై తాజ్ హోటల్ ఇన్సిడెంట్, అందులో జరిగిన విషయాలు స్క్రీన్ పై గూస్ బంప్స్ వచ్చేలా చూపించారు. ముఖ్యంగా సందీప్ కేరెక్టరైజేషణ్ ని స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి అతని మీద రెస్పెక్ట్ పెరిగేలా చేశారు. నిజానికి సినిమాలో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ తో సందీప్ ఎలాంటి వాడు అతని మెంటాలిటీ ఎలాంటిది ? ఎవరికైనా ఆపద వస్తే ఎలా ముందుకు వస్తాడు అనేది ఎలివేట్ చేసి దాన్ని క్లైమాక్స్ కి లింక్ చేశారు. ఆ డిజైనింగ్ బాగుంది. లవ్ ట్రాక్ లో కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ దాన్ని మరీ డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ రెండో భాగంలో సందీప్ అతని భార్య మధ్య ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవ్వడానికి లవ్ ట్రాక్ కాస్త ప్లస్ అయ్యింది.

కొన్ని సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ , నటీ నటుల పెర్ఫార్మెన్స్ బాగా హెల్ప్ అవుతుంది. ‘మేజర్’ కి కూడా అదే జరిగింది. యాక్టర్స్ అందరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్ నుండి బెస్ట్ అవుట్ పుట్ అందింది. విజువల్స్ , సౌండింగ్ బాగా కుదిరాయి. ప్రీ ఇంటర్వెల్ వరకూ స్లోగా సాగిన కథనం ఆ తర్వాత స్పీడ్ పెరిగి  సినిమా గ్రాఫ్ కూడా పెంచింది. క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుడిని సీట్లో నుంచి కదలకుండా చేసింది. హోటల్ లో టెర్రరిస్టులపై మేజర్ సందీప్ అండ్ టీం ఎటాక్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంది. అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చే సీన్ ప్రేక్షకుడి చేత విజిల్స్ వేయించి క్లాప్స్ కొట్టించేలా ఉంది. ఇక ప్రీ క్లైమాక్స్ లో శేష్ “నీకు కూడా తెలియాల్సిన అవసరం లేదు” అంటూ చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంది. దానికి లీడ్ సీన్ కూడా మెప్పించింది. అలాగే సోల్జర్స్ త్యాగం మాత్రమే అందరికీ కనిపిస్తుంది కానీ మా త్యాగం ఎవ్వరికీ తెలియదు అంటూ సందీప్ భార్య పాత్రతో చెప్పించిన డైలాగ్ ఆకట్టుకుంది. కథ – స్కీన్ ప్లే , యాక్షన్ ఎపిసోడ్స్ , అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి. ముఖ్యంగా తన ప్రాణం పోయే చివరి క్షణం వరకూ దేశం కోసం సందీప్ చేసిన పోరాటంతో వచ్చే క్లైమాక్స్ కంటతడి పెట్టించింది. సందీప్ మరణ వార్త విని అతని తల్లి ఏడుస్తూ నడుచుకుంటూ రోడ్ మీద వెళ్ళే సీన్ ప్రేక్షకుల కళ్ళను చెమ్మ చేస్తుంది.

నిజానికి ముంబై టెర్రరిస్ట్ ఎటాక్ ఘటనలో సందీప్ తో పాటు చాలా మంది సోల్జర్స్, పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.  వారి కేరెక్టర్స్ కూడా కొన్ని హైలైట్ చేసి చూపిస్తే బాగుండేది. కానీ ఇది సందీప్ బయోపిక్ కావడంతో అతని కథ మీద అతని కేరెక్టర్ మీదే దృష్టి పెట్టి ఉండొచ్చు. అందుకే సందీప్ తండ్రి పాత్ర తో సినిమా కథను నెరేట్ చేసి ఇది సందీప్ సినిమా అని చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా పూర్తయ్యాక స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ‘మేజర్’ కి అది దక్కింది. ఎమోషనల్ క్లైమాక్స్ చూసి సందీప్ జోహార్ అంటూ స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తారు ప్రేక్షకులు. ఓవరాల్ సందీప్ నిజ జీవిత కథతో తెరకెక్కిన ‘మేజర్’ అతని ఘన నివాళి అందించేలా ఉంది.  ఈ సినిమాను థియేటర్స్ లో చూసి ఆ ఫీల్ పొందాల్సిందే. ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి అయిన మహేష్ బాబు ని కూడా ఈ సందర్భంగా అభినందించాల్సిందే.

ఇది ఒక సైనికుడి పోరాటం. దేశభక్తి కి నిదర్శనం. ఇలాంటి సినిమాని రేటింగ్ చట్రం లో పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడం లేదు. జై హింద్.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics