సన్ ఆఫ్ ఇండియా
Thursday,November 26,2020 - 02:31 by Z_CLU
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో డాక్టర్ మోహన్‌బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదు.
మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
కథ-దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
స్క్రీన్‌ప్లే: డాక్టర్ ఎం. మోహన్‌బాబు
నిర్మాత: విష్ణు మంచు
బ్యానర్స్: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
మ్యూజిక్: మేస్ట్రో ఇళయరాజా
డీఓపీ: సర్వేష్ మురారి
డైలాగ్స్: డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్
స్టైలిస్ట్ (డాక్టర్ మోహన్‌బాబు): విరానికా మంచు
పాటలు: సుద్దాల అశోక్‌తేజ
ఆర్ట్: చిన్నా
ఎడిటింట్: గౌతంరాజు
Release Date : 20220218