ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రివ్యూ

Friday,June 02,2017 - 02:35 by Z_CLU

నటీ నటులు : సుమంత్ అశ్విన్,అనీషా, మనాలి రాథోడ్, మానస హిమవర్ష

సంగీతం : మణి శర్మ

సినిమాటోగ్రఫీ :నగేష్ బన్నెల్

మాటలు : కళ్యాణ్ రాఘవ్

నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వంశీ

రిలీజ్ డేట్ : జూన్ 2 ,2017

 

సరిగ్గా 32 సంవత్సరాల క్రితం ‘వంశీ’ దర్శకత్వంలో రూపంది ఎన్నో సంచనాలు సృష్టంచిన ‘లేడీస్ టైలర్’ సినిమాకి సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ ఈరోజే థియేటర్స్ లోకొచ్చింది. అలనాటి సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ‘ఫ్యాషన్ డిజైనర్’ అందుకుందా..లేదా..చూద్దాం.


కథ :

గోదావరి జిల్లాలో రాజోలు గ్రామంలో ఫ్యాషన్ డిజైనర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న సుందరం కొడుకు గోపాలం(సుమంత్ అశ్విన్) ఒకానొక సందర్భంలో తన చేతి పై మన్మధ రేఖ ఉందంటూ ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో డబ్బున్న కన్నెను తన మన్మధ రేఖతో ప్రేమలో పడేసి వచ్చే కట్నం తో సిటీ లో ఫ్యాషన్ డిజైనర్ షాప్ పెట్టుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో ఊళ్ళో ఉన్న అందమైన డబ్బున్న అమ్మాయిలు గేదెల రాణి(మానస హిమవర్ష) ను , అమ్ములు(మనాలి రాథోడ్) మహాలక్ష్మి(అనిషా) లను తన ప్రేమలో పడేస్తాడు గోపాళం. ఈ ముగ్గురిని తన ప్రేమలో పడేసిన గోపాలం చివరికి ఎవరిని పెళ్లాడాడు.. అనేది సినిమా కథాంశం…

నటీ నటుల పని తీరు :

సుందరం కొడుకుగా లేటెస్ట్ ఫాషన్ డిజైనర్ గోపాళం గా సుమంత్ అశ్విన్ పరవాలేదనిపించుకున్నాడు. అనీషా, మనాలి రాథోడ్, మానస గ్లామరస్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. బట్టల సత్యం కొడుకుగా పండు క్యారెక్టర్ లో ప్రముఖ ట్రైనర్ సత్యానంద్ కొడుకు రాఘవేంద్ర తన కామెడీ తో ఎంటర్టైన్ చేశాడు. కృష్ణ భగవాన్ తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ఇక మిగతా నటీ నటులందరూ తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసి పరవాలేదనిపించుకున్నారు.

టెక్నీషియన్స్ పని తీరు :

ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ నగేష్ గురించే. ముఖ్యంగా గోదావరి అందాలను తన కెమెరాతో మరింత అందంగా చూపించి సినిమాకు హైలైట్ గా నిలిచాడు నగేష్. మణిశర్మ వంశీ మార్క్ మ్యూజిక్ తో మెస్మరైజ్ చేశాడు. ‘పాపికొండల్లో’ పాటకు చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. వంశీ స్క్రీన్ ప్లే, కామెడీ కొన్ని సందర్భాలలో మాత్రమే ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

అలనాటి క్లాసికల్ సూపర్ హిట్ మూవీ ‘లేడీస్ టైలర్’ కి వంశీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోకి ఈ కథ ముందుగా రవి తేజ చేయబోతున్నాడని తెలియగానే అందరిలో ఈ సినిమా పై ఇంట్రెస్ట్ కలిగింది. రవి తేజ తర్వాత రాజ్ తరుణ్ తో పాటు మరో యంగ్ హీరో పేరు కూడా వినిపించిన్నప్పటికీ ఫైనల్ గా ఈ కథ సుమంత్ అశ్విన్ కి దగ్గరికి చేరింది. సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమాతో వంశీ మళ్ళీ తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేసి ఐయామ్ బ్యాక్ అనిపించుకుంటాడనుకున్నారంతా.. అయితే వంశీ తన మార్క్ కామెడీతోనే ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా గోదావరి అందాలను, పల్లె వాతావరణాన్ని అద్భుతంగా చూపిస్తూ అక్కడ ఉండే మనుషుల యాసతో ఎంటర్టైన్ చేసే వంశీ ఫ్యాషన్ డిజనైర్ ను కూడా అలాగే తెరకెక్కించినప్పటికీ అది కాస్త బెడిసికొట్టిందనే చెప్పాలి. ఇక కథలో వచ్చే తన మార్క్ కామెడీ పై ఫోకస్ తగ్గించి రొమాంటిక్ సీన్స్ పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాడు వంశీ. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ తో మాత్రమే ఎంటర్టైన్ చేసిన వంశీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ తో పరవాలేదనిపించాడు. అయితే సినిమా చూసాక మాత్రం అప్పటి లేడీస్ టైలర్ కి ఇప్పుడు ఈ సీక్వెల్ అవసరమా..అనే డౌట్ మాత్రం ఆడియన్స్ లో కలుగుతుంది. ఫైనల్ గా ఫ్యాషన్ డిజైనర్ కేవలం కొన్ని కామెడీ సీన్స్ తో మత్రమే ఎంటర్టైన్ చేశాడు.

 

రేటింగ్ : 2 .5 /5