'అమీ తుమీ' రివ్యూ

Friday,June 09,2017 - 03:15 by Z_CLU

నటీనటులు : అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా

మ్యూజిక్: మణిశర్మ

ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు

కథ-మాటలు- స్క్రీన్ ప్లే–దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

రిలీజ్ డేట్ : 9 జూన్ 2017

 

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, వెన్నెల కిషోర్, ఇషా, అదితి మ్యాకల్ తో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ “అమీ తుమీ” ఈరోజే ప్రేక్షకులముందుకొచ్చింది. గతేడాది ‘జెంటిల్ మెన్’ సినిమాతో హిట్ అందుకున్న ఇంద్రగంటి ఈ సినిమాతో ఎలా ఎంటర్టైనర్ చేసాడో..చూద్దాం…


కథ :

వడ్డీ వ్యాపారిగా సంపన్నుడైన జనార్దన్(తనికెళ్ళ భరణి) కొడుకు విజయ్(అవసరాల శ్రీనివాస్) మరో వ్యాపారైన గంగాధర్ కూతురు మాయ(అదితి మ్యాకల్)ని ప్రేమిస్తూ తననే పెళ్లాడాలని నిశ్చయించుకుంటాడు. అలాగే జనార్దన్ కూతురు దీపిక(ఇషా) కూడా అనంత్(అడివి శేష్) అనే కుర్రాడిని ప్రేమిస్తూ తనతోనే జీవితం పంచుకోవాలని నిశ్చయించుకుంటుంది. అయితే వీళ్లిద్దరి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు తండ్రి జనార్దన్. ఈ క్రమంలో శ్రీ చిలిపి(వెన్నెల కిషోర్) అనే మరో వ్యాపారి కొడుకు రంగంలోకి దిగి ఈ రెండు జంటలను ఒకటి చేసి పెళ్ళి జరిపిస్తాడు. ఇంతకీ శ్రీ చిలిపి ఎవరు.. ప్రేమించుకుంటూ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెళ్లిచేసుకోలేకపోతున్న ఈ రెండు జంటల్నీ ఎలా కలిపాడు. అనేది సినిమా కథాంశం..

నటీనటుల పనితీరు:

ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ‘అష్టా చెమ్మా’తో నటుడిగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్ మరోసారి అలాంటి కామెడీ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేశాడు. అనంత్ గా అడివి శేష్ కూడా తన క్యారెక్టర్ తో పరవాలేదనిపించుకున్నాడు. ఇషా గ్లామరస్ క్యారెక్టర్ తో అదితి మ్యాకల్ పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక శ్రీ చిలిపి అనే కామెడీ క్యారెక్టర్ తో వెన్నెల కిషోర్ తన మార్క్ కామెడీ తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. నటి శ్యామల తన క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేసి సినిమాకు ప్లస్ అయింది. తనికెళ్ళ తెలంగాణ యాసతో కూడిన డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశాడు. ఇక వేణుగోపాల్, అనంత్, తడివేలు తదితరులు తమ క్యారెక్టర్స్ కు న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు :

సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మణి శర్మ గురించే. బలమైన సన్నివేశాలకు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్టైన మణి శర్మ ఈ సినిమాలోని హైలైట్ గా నిలిచే కామెడీ సన్నివేశాలకు తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచాడు. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ మణి అందించిన రెండు పాటలు పరవాలేదనిపించాయి. ఇంద్రగంటి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేశాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పరవాలేదు.


జీ సినిమాలు సమీక్ష :

గతంలో తన మార్క్ కామెడీ సినిమాలతో ఎంటర్టైన్ చేసి పలు హిట్స్ అందుకున్న దర్శకుడు ఇంద్రగంటి లేటెస్ట్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ‘జెంటిల్ మెన్’ సినిమాతో కొత్తగా ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇంద్రగంటి ఎలాంటి సినిమా చేస్తాడా అనుకుంటుండగా మరోసారి తనకి కలిసొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ జోనర్ నే సెలెక్ట్ చేసుకొని ‘అమీ తుమీ’ సినిమాను కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. దర్శకుడిగా తన మార్క్ కామెడీ తో సినిమాను స్టార్ట్ చేసిన ఇంద్రగంటి క్లైమాక్స్ వరకూ అదే ఎంటర్టైన్మెంట్ తో సినిమాను ముందుకు నడిపించాడు. ఒక సింపుల్ కథకు కామెడీ జోడించి తన మార్క్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా క్యారెక్టర్స్ కి తగిన నటులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి మంచి నటన రాబట్టి ఆ క్యారెక్టర్స్ తో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేసాడు. శ్రీ చిలిపి అనే క్యారెక్టర్ తో తనదైన కామెడీతో ఎంటర్టైన్ చేసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు వెన్నెల కిషోర్. ఇంద్రగంటి డైలాగ్స్, ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే, వెన్నెల కిషోర్-శ్యామల కామెడీ, అవసరాల, అడివిశేష్,ఇషా, అదితి పెర్ఫార్మెన్స్, మణి శర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ఓవరాల్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కోరుకునే ప్రేక్షకులను ‘అమీ తుమీ’ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

 

రేటింగ్ : 3 /5