జీ సినిమాలు ( 9th మార్చ్)

Sunday,March 08,2020 - 10:10 by Z_CLU

మధుమాసం

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్

ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామానాయుడు

దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

రిలీజ్ డేట్ : 9 ఫిబ్రవరి 2007

అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు.

_______________________________________

దేవత

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి

ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయిచీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది వెంటనే  సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుందిఅదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయివాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయికానీ దేవతలోని  పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుందిసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

_________________________________

గోదావరి

నటీనటులు : సుమంత్కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావుకమల్ కామరాజుతనికెళ్ళ భరణిశివగంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

 

అందాల రాముడు

నటీనటులు సునీల్ఆర్తి అగర్వాల్
ఇతర నటీనటులు ఆకాశ్వడివుక్కరసికోట శ్రీనివాస రావుబ్రహ్మానందంధర్మవరపువేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్పరాస్ జైన్
రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

___________________________________________________

మిస్టర్

నటీనటులు : వరుణ్ తేజ్లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : హేబా పటేల్నిఖితిన్ ధీర్ప్రిన్స్ సీసిల్పృథ్వీ రాజ్హరీష్ ఉత్తమన్రవి ప్రకాష్సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్

 డైరెక్టర్శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : 7నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017 

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరాచై కి ఏం చెప్పిందిచై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరుచివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

________________________________________

తుంబా

నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్

ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు

మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి

డైరెక్టర్ హరీష్ రామ్ L.H.

ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి

రిలీజ్ డేట్ : 21 జూన్ 2019

అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.