జీ సినిమాలు (9th ఫిబ్రవరి)

Monday,February 08,2021 - 10:00 by Z_CLU

Gulebakavali-గులేబాకావలి-prabhudeva-hansika-zeecinemalu

గులేబాకావలి

నటీనటులు – ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు
స్టంట్స్: పీటర్ హెయిన్స్
సంగీతం: వివేక్ మెర్విన్
కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్
ఆర్ట్: కదీర్
పాటలు: సామ్రాట్
దర్వకత్వం: కల్యాణ్
నిర్మాత: మల్కాపురం శివకుమార్

బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన సినిమా గులేబకావలి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి కీలక పాత్రలో కనిపిస్తారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగులో అదే పేరుతో విడుదలైంది ఈ సినిమా.

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పూర్తిగా కామెడీ ఎలిమెంట్స్ తో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్, హన్సిక గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్స్.

________________________________________

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ మీరా జాస్మీన్
ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

__________________________________

Bendu-Apparao-zee-cinemalu-586x245

బెండు అప్పారావు R.M.P.

నటీనటులు : అల్లరి నరేష్కామ్న జెఠ్మలానీ

ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్మేఘన రాజ్ఆహుతి ప్రసాద్రఘుబాబు, L.B. శ్రీరామ్ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినాచిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

__________________________________

సైజ్ జీరో

నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015

అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.
_________________________

thumbaa-zee-cinemalu-225x320

తుంబా

నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్

ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు

మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి

డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.

ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి

రిలీజ్ డేట్ : 21 జూన్ 2019

అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

________________________________

పేపర్ బాయ్

నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్

ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్

డైరెక్టర్ : V. జయశంకర్

ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018

పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధానా కథాంశం.

_______________________________________________

అర్జున్ సురవరం

తారాగణం : నిఖిల్‌ సిద్ధార్థ్‌, లావణ్య త్రిపాఠి, తరుణ్‌ అరోరా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, సత్య, నాగినీడు, రాజారవీంద్ర తదితరులు
బ్యానర్‌: ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, మూవీ డైనమిక్స్‌
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: సామ్‌ సి.ఎస్‌.
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
కథ, కథనం, దర్శకత్వం: టి. సంతోష్‌
విడుదల తేదీ: నవంబర్‌ 29, 2019

అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను జీ సినిమాలు ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి.