ZeeCinemalu - Dec 20

Saturday,December 19,2020 - 10:15 by Z_CLU

kathakali-zee-cinemalu-384x640

కథాకళి
నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా
ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : పాండిరాజ్
రిలీజ్ డేట్ : 18 మార్చి 2016
విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

=======================

shivalinga-zee-cinemalu-434x320-434x320

శివలింగ
నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్
ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్
రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

=======================

జై చిరంజీవ
నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపినక్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జైచిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

==========================

mister-zee-cinemalu-586x308

మిస్టర్
నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్: శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : 7నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

======================

kotikokkadu-movie-కోటికొక్కడు-మూవీ-zeecinemalu-586x293

కోటికొక్కడు
నటీనటులు: సుదీప్‌, నిత్యమీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, నాజర్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ : రాజారత్నం
డైలాగ్స్‌ : శశాంక్‌ వెన్నెలకంటి
సాహిత్యం: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందు మౌళి
సంగీతం: డి. ఇమ్మాన్‌
నిర్మాత: కళ్యాణ్‌ ధూళిపాళ్ల
దర్శకత్వం: కె.ఎస్‌. రవికుమార్‌
సత్యం (సుదీప్) ఓ రియల్‌ఎస్టేట్ బిజినెస్ మేన్. నలుగురిలో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే సత్యంలో మరో యాంగిల్ ఉంటుంది. అదే దొంగతనాలు, దోపీడీలు. శివం పేరుతో బిగ్ షాట్స్ వద్ద వద్ద ఉన్న వందల కోట్ల బ్లాక్ మనీని కొల్లగొడుతూ ఉంటాడు.
అయితే బయటి ప్రపంచానికి మాత్రం తన అన్నయ్య శివం ఆ దొంగతనాలన్నీ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తుంటాడు. తాము ఇద్దరం అని అందర్నీ నమ్మిస్తుంటాడు. సత్యం, శివం ఇద్దరు కాదని… ఇద్దరూ ఒకడేనని అసిస్టెంట్ కమీషనర్ (రవిశంకర్) కు అనుమానం. ఎలాగైనా సత్యంను ఆధారాలతో పట్టుకోవాలని చూస్తుంటాడు.
మరి సత్యం దొరికాడా.. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

=====================

shiva-zee-cinemalu

శివ
నటీనటులు : నాగార్జున, అమల
ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా
డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ
ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రోటీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 ఏళ్ళు గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.