జీ సినిమాలు ( 2nd జూలై)

Sunday,July 02,2017 - 07:53 by Z_CLU

పవిత్ర ప్రేమ

హీరో హీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, జూన్ 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

==============================================================================

శివ  

నటీ నటులు : నాగార్జున, అమల

ఇతర నటీనటులు : రఘువరన్, J.D.చక్రవర్తి, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, పరేష్ రావల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయ రాజా

డైరెక్టర్ : రామ్ గోపాల్ వర్మ

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 1990

రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘శివ’ దాదాపు అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రూపు రేఖల్ని మార్చేసింది. సినిమా అంటే ఇలాగే ఉండాలి అని ఒక రితీన్ ఫార్మూలాలో వెళుతున్న ట్రెండ్ ఒక పెద్ద కుదుపు లాంటిదీ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి 26 ఏళ్ళు గడిచినా ఆ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి ఇళయ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటికీ ఫ్రెష్ గానే అనిపిస్తుంది.

==============================================================================

అదిరిందయ్యా చంద్రం

హీరో హీరోయిన్లు – శివాజీ, లయ

ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – శ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ – ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

==============================================================================

 

యుగానికొక్కడు

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

==============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

=============================================================================

పోలీస్ స్టోరీ-2

హీరో – సాయికుమార్

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం

సంగీతం – ఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.