'రంగస్థలం' టైటిల్ వెనక రీజన్ తెలుసా?

Sunday,July 02,2017 - 10:01 by Z_CLU

ప్రెజెంట్ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ టైటిల్ పై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సుకుమార్ ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటా..అనే ప్రశ్నలు వాటికి ఏవేవో జవాబులు కూడా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ రంగస్థల నటుడిగా కనిపించనున్నాడని అందుకే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసారని టాలీవుడ్ లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ పై ఇటీవలే క్లారిటీ ఇచ్చింది యూనిట్. 1985 సంవత్సరంలో ‘రంగస్థలం’అనే ఊరిలో జరిగే కథ కావడంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టినట్లు తెలియజేశారు. ఆ టైం లో జరిగిన ఓ కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ అయితేనే పర్ఫెక్ట్ అని భావించే సుకుమార్ ఈ టైటిల్ ని ఫిక్స్ చేసాడట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్  చేస్తారు.