జీ సినిమాలు (28th మే)

Saturday,May 27,2017 - 10:03 by Z_CLU

ప్రేమాభిషేకం

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

రాముడు – భీముడు

నటీ నటులు : N.T.రామారావు, జమున

ఇతర నటీనటులు : S.V. రంగారావు, గిరిజ, రేలంగి, రమణ రెడ్డి, సూర్య కాంతం, రాజనాల, L. విజయ లక్ష్మి

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల నాగేశ్వర రావు

డైరెక్టర్ : తాపీ చాణక్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 21 మే 1964

నందమూరి తారక రామారావు గారి కరియర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ‘రాముడు- భీముడు’ ఆల్ టైం హిట్. ఈ సినిమాని ఇప్పుడు చూసినా అంతే ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. రొటీన్ లైఫ్ లో బోర్ అయిపోయి చూడటానికి ఒకేలా ఉండే రాముడు భీముడు ఒకరి స్థానంలో ఒకరు రావడంతో, మంచి కామెడీ జెనెరేట్ అవుతుంది. డ్యూయల్ రోల్ లో నటించిన NTR పర్ఫామెన్స్ హైలెట్.

==============================================================================

బి ఎఫ్ జి

నటీనటులు : మార్క్ రైలెన్స్, రూబీ బార్న్ హిల్

ఇతర నటీనటులు : ఫినెలోప్ విల్టన్, జిమైన్ క్లిమెంట్, రెబెక హాల్, రేఫ్ స్పాల్ డేనియల్ బేకన్, క్రిస్ గిబ్స్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ విలియమ్స్

డైరెక్టర్ : స్టీవెన్ స్పీల్ బర్గ్

ప్రొడ్యూసర్ : ఫ్రాంక్ మార్షల్, స్యామ్ మర్సర్

రిలీజ్ డేట్ : జూలై 1, 2016

చిన్నపిల్లల పెద్ద వాళ్ళ వరకు ఈజీగా కనెక్ట్ అయిపోయే అద్భుత ఫాంటసీ చిత్రం The BFG. స్టీవెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అయింది. సోఫీ కి BFG కి మధ్య జరిగే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ఆదివిష్ణు

హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ

నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు,  ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ

సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ

దర్శకత్వం – భరత్ పారేపల్లి

విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్  లో పేరు తెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక  స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.

==============================================================================

దేవత 

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి

నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================================================================

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

అల్లుళ్ళా మజాకా

నటీనటులు : అజీజ్ నాజర్, స్తుతి, మస్త్ ఆలీ, వందన

మ్యూజిక్ డైరెక్టర్ : విశ్వ

డైరెక్టర్ : RK

ప్రొడ్యూసర్ : RK

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఫన్ లోడెడ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిందే అల్లుళ్ళా మజాకా. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన హైదరాబాదీ నవాబ్స్ కి డబ్బింగ్ వర్షన్ సినిమా. RK నిర్మించిన సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.