నా హీరో నిజంగా సూపర్

Saturday,May 27,2017 - 08:28 by Z_CLU

అక్కినేని యాంగ్ హీరో నాగచైతన్య-రకుల్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఇటీవలే థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ ను ఏర్పాడు చేసారు యూనిట్.

ఈ సందర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ” రారండోయ్‌ వేడుక చూద్దాం’ రిలీజ్‌ కోసం గత నెల రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అమల హాలిడే ట్రిప్‌కి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లలేదు. సినిమా రిలీజై సూపర్‌హిట్‌ అయ్యింది. అందరం చాలా హ్యాపీగా వున్నాం. రేపే హాలిడే ట్రిప్‌కి వెళ్తున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌ కావడానికి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఓన్‌ చేసుకోవడమే. థియేటర్స్‌ నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుండి కళ్యాణ్‌ కృష్ణ చాలా కష్టపడ్డాడు. చైతన్య, రకుల్‌ప్రీత్‌, జగపతిబాబు, సంపత్‌ సహా ప్రతి ఒక్కరూ మంచి ఎమోషన్‌గా నటించారు. డిఎస్‌పి సంగీతం అందించడమే కాదు సినిమాలో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. ‘తికట తకుజుం’, ‘భ్రమరాంబకు నచ్చేశానే’, టైటిల్‌ సాంగ్‌.. ఇలా అన్నీ సాంగ్స్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దేవి ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్‌ అందించాడు. తండ్రి అంటే ఇలా వుండాలి అనేలా జగపతిబాబు చాలా బాగా చేశారు. ఒక హీరోయిన్‌ను క్యారెక్టర్‌ పరంగా రేర్‌గా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి క్యారెక్టర్స్‌ ఈమధ్య సినిమాల్లో చాలా రేర్‌గా వుంటున్నాయి. అలాంటి భ్రమరాంబ క్యారెక్టర్‌ను రకుల్‌ ప్రీత్‌ చాలా బాగా చేసింది. ఏ హీరో అయినా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోడానికి ఇష్టపడ్తాడు. ఈ సినిమాలో కూడా చైతు పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడుతున్నారు. బీచ్‌ సీన్‌లో చైతు పెర్‌ఫార్మెన్స్‌కి ఈలలు వేస్తున్నారని తెలిసి హ్యాపీగా అన్పించింది. రిలీజ్‌కి ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా హీరో నిజంగా సూపర్‌.” అని అన్నారు.