జీ సినిమాలు ( 27th నవంబర్ )

Sunday,November 26,2017 - 10:08 by Z_CLU

కృష్ణార్జున

హీరో  హీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్
ఇతర
నటీనటులునాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం
సంగీతంఎం.ఎం. కీరవాణి
దర్శకత్వంపి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

=============================================================================

దేవత

హీరో  హీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి
ఇతర 
నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు
సంగీతం – చక్రవర్తి
దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు
విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

==============================================================================

శశిరేఖా పరిణయం 

హీరో హీరోయిన్లుతరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులుపరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు

సంగీతం   –  మణిశర్మ, విద్య సాగర్

దర్శకత్వం  –  కృష్ణ వంశీ

విడుదల తేదీ – 2009

 వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

=============================================================================

టక్కరి

నటీనటులు : నితిన్, సదా

ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్

ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్

రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

టక్కరి ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.

==============================================================================

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

జయసూర్య

నటీనటులు : విశాల్, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : సముథిరఖని, సూరి, DMJ రాజసింహన్, ఐశ్వర్య దత్త తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంథిరణ్

ప్రొడ్యూసర్ : S. మదన్

రిలీజ్ డేట్ : 4 సెప్టెంబర్ 2015

విశాల్, కాజల్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జయసూర్య. సిటీలో కిడ్నాప్ లు చేసి భయ భ్రాంతులకు గురి చేసే క్రిమినల్స్ కి మధ్య జరిగే క్రైం థ్రిల్లర్ ఈ సినిమా. ACP  జయసూర్యగా విశాల్ నటన సినిమాకే హైలెట్.