రాజమౌళి ప్లానేంటి ?

Sunday,November 26,2017 - 04:02 by Z_CLU

‘బాహుబలి’ తో బిగ్గెస్ట్ హిట్ అందుకొని ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా…? అనే విషయం ప్రెజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకూ జక్కన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలొచ్చాయి. దానికి తోడు రాజమౌళి ఈ మధ్య చిరు ఫామిలీతో ఎక్కువగా కనిపిస్తుండడంతో ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అనే న్యూస్ స్ప్రెడ్ అయింది.

‘రంగస్థలం’ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన మెగా ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు చరణ్. బోయపాటి తో ఓ సినిమా ఉంటుందని టాక్ వినిపించినప్పటికీ రాజమౌళి సినిమా తర్వాతే ఆ సినిమా ఉంటుందనుకున్నారంతా. కానీ సడెన్ గా బోయపాటితో చేయబోయే సినిమాకు క్లాప్ కొట్టేసి షూట్ కి రెడీ అవుతున్నాడు చరణ్.

ఇక ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా చక్కర్లు కొట్టగా ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతుండడంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా లిస్ట్ లో నుంచి తారక్ కూడా మిస్ అయ్యాడు.. మరి ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ సినిమాలను స్టార్ట్ చేయడంతో ఇప్పుడు జక్కన్న ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ప్రశ్నర్ధకం గా మిగిలింది. రాజమౌళి ప్లానేంటో..తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.