జీ సినిమాలు ( 22nd నవంబర్)

Tuesday,November 21,2017 - 10:04 by Z_CLU

గణేష్

హీరో హీరోయిన్లు – రామ్,కాజల్

ఇతర నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం

సంగీతం      – మిక్కీ జె మేయర్

దర్శకత్వం  –  శరవణన్

విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

==============================================================================

తాత మనవడు

నటీనటులు – వినోద్ కుమార్, రంజిత

ఇతర నటీనటులు – కృష్ణంరాజు, సంఘవి, శారద, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్, బ్రహ్మానందం

సంగీత దర్శకుడు –  మాధవపెద్ది సురేష్

దర్శకుడు – ఎస్.సదాశివరావు

విడుదల తేదీ – 1996

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ మూవీ తాత-మనవడు. అప్పటికే యాక్షన్ సినిమాల నుంచి కుటుంబకథాచిత్రాల వైపు మళ్లారు హీరో వినోద్ కుమార్. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ  హీరోగా కొన్ని హిట్స్ కూడా అందుకున్నారు. అందుకే తాత-మనవడు కథకు హీరో కోసం  పెద్దగా అన్వేషణలు ఏమీ పెట్టుకోలేదు నిర్మాత రామానాయుడు. అయితే తాత పాత్ర వద్దకు  వచ్చేసరికి మాత్రం చాలా డిస్కషన్ జరిగింది. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు  పరిశీలించిన తర్వాత ఫైనల్ గా కృష్ణంరాజును అనుకున్నారు. అలా  మనవడిగా వినోద్ కుమార్, తాతగా కృష్ణంరాజు సెట్ అయిపోయారు. సదాశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  సినిమాకు సంగీతం పెద్ద హైలెట్.

=============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

కృష్ణార్జున

హీరో  హీరోయిన్లు – మంచు విష్ణుమమతా మోహన్ దాస్
ఇతర నటీనటులు – నాగార్జునమోహన్ బాబునాజర్నెపోలియన్సునీల్బ్రహ్మానందం
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం – పి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జునభక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబుబాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

=============================================================================

మిరపకాయ్

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ

ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల

రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

కంత్రి

నటీనటులు : NTR, హన్సిక మోత్వాని, తానీషా ముఖర్జీ

ఇతర నటీనటులు : ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రఘు బాబు, ముకేష్ రిషి, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : మెహర్ రమేష్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 9 మే 2008

NTR, హన్సిక మోత్వాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ కంత్రి. స్టైలిష్ ఎంటర్ టైనర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అశ్విని దత్ నిర్మించారు.  పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో క్లైమాక్స్ కి కాస్త ముందుగా వచ్చే ట్విస్ట్ హైలెట్.