రేపు లాంచ్ కానున్న శర్వానంద్ సినిమా

Wednesday,November 22,2017 - 11:28 by Z_CLU

మహానుభావుడు సినిమా సక్సెస్ తరవాత  శర్వానంద్ హను రాఘవపూడి సినిమాతో బిజీ కానున్నాడు. క్రిష్ణగాడి వీర ప్రేమగాథ  గాథ, రీసెంట్ గా నితిన్ ‘లై’ సినిమాతో డిఫెరెంట్ ఫిల్మ్ మేకర్ గా తనకంటూ పర్టికులర్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హను రాఘవపూడి శర్వానంద్ కోసం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది.

ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ సినిమాలు చేస్తూ మినిమం సక్సెస్ రేషియోతో దూసుకుపోతున్న శర్వానంద్, స్టైలిష్ మూవీ మేకింగ్ లో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే న్యాచురల్ గానే టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

సుధాకర్ చిగురుపాటి, ప్రసాద్ చుక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రేపు గ్రాండ్ గా ఈ సినిమాని లాంచ్ చేయనున్న సినిమా యూనిట్, ఈ సినిమాకి సంబంధించిన తక్కిన డీటేల్స్ అనౌన్స్ చేయనున్నారు.