జీ సినిమాలు ( 21st మే )

Saturday,May 20,2017 - 10:06 by Z_CLU

గణేష్

నటీ నటులు : వెంకటేష్, రంభ, మధుబాల

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, చంద్ర మోహన్, కోట శ్రీనివాస్ రావు, రేవతి, అశోక్ కుమార్.

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : తిరుపతిస్వామి

నిర్మాత : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 19 జూన్ 1998

‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్- గణేష్’ . ఈ డైలాగ్ కొన్ని రోజుల వరకు యూత్ నోటిలో ఊతపదంలా వినిపించేది అంత ఇంపాక్ట్ చూపించింది గణేష్ సినిమా. ఒక సాధారణ జర్నలిస్ట్ రోల్ లో అతి సహజంగా నటించాడు విక్టరీ వెంకటేష్. కరప్టెడ్ డాక్టర్స్ వల్ల తన కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో, తిరగబడ్డ గణేష్ ఎలా సంఘ విద్రోహులను మట్టి కరిపించాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ గణేష్. మణిశర్మ సంగీతం సినిమాకి ఎసెట్.

==============================================================================

అన్నవరం

నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

సీజన్ ఆఫ్ ది విచ్

నటీనటులు : నికోలస్ కేజ్, రాన్ పర్ల్ మన్

ఇతర నటీనటులు : క్లేర్ ఫాయ్, స్టీఫెన్ క్యాంప్ బెల్ మూరే, రాబర్ట్ షీహన్, అల్రిచ్ థామ్సన్, స్టీఫెన్ గ్రాహం మరుయు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అట్లీ ఒర్వర్ సన్

డైరెక్టర్ : డామినిక్ సేన

ప్రొడ్యూసర్ : ఆలెక్స్ గార్ట్ నార

రిలీజ్ డేట్ : జనవరి 4, 2011

హాయ్ ఎండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన అద్భుతమైన హాలీవుడ్ సినిమా సీజన్ ఆఫ్ ది విచ్. డామి నిక్ సేన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

==============================================================================

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

సత్య

నటీనటులు : మనోజ్ బాజ్ పాయ్, J.D. చక్రవర్తి, ఊర్మిళ మటోండ్కర్

ఇతర నటీనటులు : పరేష్ రావల్, ఆదిత్య శ్రీవాస్తవ, సౌరభ్ శుక్ల, గోవింద్ నామ్దేవో, మకరంద్ దేశ్ పాండే మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ భరద్వాజ్

డైరెక్టర్ : రామ గోపాల్ వర్మ ర

ప్రొడ్యూసర్ : రామ్ గోపాల్ వర్మ, P. సోమ్ శేఖర్

రిలీజ్ డేట్ : 3 జూలై 1998

  రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన బాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ ఎంటర్ టైనర్ సత్య. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద హైలెట్.

==============================================================================

 

ఆవకాయ బిర్యాని

నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.