ప్రభాస్ హీరోయిన్స్ లిస్ట్

Sunday,May 21,2017 - 10:02 by Z_CLU

బాహుబలి తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’.. సుజీత్ దర్శకత్వం లో 150 కోట్ల  బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్ తో  భారీ అంచనాలు నెలకొల్పి మోస్ట్ ఎవైటింగ్ మూవీ లిస్ట్ లో చేరిపోయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్స్ అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఈ సినిమా లో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని టాక్ వినిపించడంతో  ప్రభాస్ సరసన ఓ క్రేజీ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని భావిస్తూ ప్రభాస్ పక్కన బాలీవుడ్ ముద్దుగుమ్మలను ఊహించేసుకుంటున్నారు ఫాన్స్. ప్రెజెంట్ ఈ సినిమాలో హీరోయిన్ గా బజ్ క్రియేట్ చేస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

ప్రభాస్ ‘సాహో’ అనే టైటిల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీయెస్ట్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను హీరోయిన్ ఊహించేసుకున్నారు ఫాన్స్. నిజానికి ప్రభాస్ సరసన కత్రినా అయితేనే పర్ఫెక్ట్ అని వీరిద్దరి జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారు ఫాన్స్..

ప్రభాస్ సరసన నటించే హీరోయిన్స్ లిస్ట్ లో వినిపిస్తున్న రెండో పేరు దీపికా పదుకునే. బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా పేరొందిన ఈ ముద్దుగుమ్మ ‘సాహో’ ప్రభాస్ కి జోడి అయితే బాగుంటుందని ఫీలవుతున్నారు ప్రభాస్ ఫాన్స్..

ఇక ‘సాహో’ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే పేరు కూడా వినిపిస్తుంది. ఇటీవలే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ బడా సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానున్న ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తే ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా సినిమాకు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీ కి జోడి గా నటిస్తున్న పూజా ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి అవుతుందనడంలో సందేహం లేదు..

‘సాహో’ లో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ పరిణితీ పేరు కూడా చక్కర్లు కొడుతుంది.. ఆ మధ్య ఓ తెలుగులో పరిణితీ ఓ సినిమా చేయాలనుకుంటుందనే వార్త వినిపించగానే ప్రభాస్ హీరోయిన్స్ లిస్ట్ లో ఈ భామ పేరు చేర్చేశారు ఫాన్స్..

ప్రెజెంట్ బాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఆలియా భట్ పేరు కూడా ‘సాహో’ హీరోయిన్స్ లిస్ట్ లో వినిపిస్తుంది. లేటెస్ట్ గా బడా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బడా హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన ఈ అమ్మడు ప్రభాస్ కి క్యూట్ జోడి గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తుంది…