జీ సినిమాలు ( 19th ఆగష్టు )

Saturday,August 18,2018 - 10:06 by Z_CLU

డోర

నటీనటులు : నయనతార, తంబి రామయ్య

ఇతర నటీనటులు : హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త

మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి

ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్

రిలీజ్ డేట్ : 31 మార్చి 2017

అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. క్రమంలో పారిజాతం వింటేజ్ కార్ ను బిజినెస్ కోసం కొంటుంది. కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పై చూడాల్సిందే…

==============================================================================

సీతారాముల కల్యాణం  లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక
ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : ఈశ్వర్
ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్
రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

ఇది మా ప్రేమకథ

నటీనటులు : రవి, మేఘనా లోకేష్

ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీను, ప్రియదర్శి, తులసి శివమణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల

డైరెక్టర్ : అయోధ్య కార్తీక్

ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017

రవి, మేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.

ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడం, దానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్, సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..? వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

==============================================================================

మొగుడు

నటీనటులు : గోపీచంద్, తాప్సీ పన్ను

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు  పక్కా రొమాంటి ఎంటర్ టైనర్. సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

=============================================================================

 

అభినేత్రి

నటీనటులు : ప్రభు దేవా, తమన్నా, సోను సూద్, అమీ జాక్సన్

ఇతర నటీనటులు : సప్తగిరి, మురళి శర్మ, పృథ్వి

మ్యూజిక్ డైరెక్టర్ : సాజిద్ వాజిద్

డైరెక్టర్ఎ.ఎల్.విజయ్

ప్రొడ్యూసర్ :  గణేష్, ప్రభుదేవా

రిలీజ్ డేట్ : అక్టోబర్ 7, 2016 

A.L. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని మరికొందరు నిర్మాతలతో కలిసి ప్రభుదేవా స్వయంగా నిర్మించాడు. కథలో కాస్తయినా ఎక్సయింట్ మెంట్ లేకపోతే.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు తమన్న. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ… ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ఇది. మిల్కీ బ్యూటీని డ్యూయల్ రోల్ లో విభిన్నంగా ప్రెజెంట్ చేసిన  సినిమా ‘అభినేత్రి’.

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ సినిమాకి పెద్ద ఎసెట్.