జీ సినిమాలు ( 18th మే )

Wednesday,May 17,2017 - 10:02 by Z_CLU

అల్లాడిస్తా

నటీ నటులు : ఉదయ కిరణ్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు:  రంభ, రోహిణి, రిచర్డ్, రాఘవ లారెన్స్, లక్ష్మి రాయ్

మ్యూజిక్ డైరెక్టర్ : దేవ

డైరెక్టర్ : బలి శ్రీరంగం

ఉదయ కిరణ్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లాడిస్తా’. మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఉదయ కిరణ్ ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించాడు. రంభ ఒక ప్రత్యేక పాత్రలో అలరిస్తుంది. దేవ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

వాన

నటీ నటులు : వినయ్ రాయ్, మీరా చోప్రా

ఇతర నటీనటులు : సుమన్, నరేష్, జయసుధ, సీత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, M.S.నారాయణ, కృష్ణుడు తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ :  కమలాకర్

డైరెక్టర్ : శ్రీకాంత్ బుల్ల

ప్రొడ్యూసర్ : M.S.రాజు

రిలీజ్ డేట్ : 15 జనవరి 2008

హిట్ సినిమాల నిర్మాత M.S.రాజు రచించి, నిర్మించిన అద్భుత ప్రేమ కథా చిత్రం వాన.  వినయ్ రాయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకి కమలాకర్ సంగీతం అందించాడు.

============================================================================

భలే దొంగలు 

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

==============================================================================

 

అమరావతి

నటీ నటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన,  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన  తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

==============================================================================

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

పోసాని జెంటిల్ మెన్

నటీనటులు : పోసాని కృష్ణమురళి, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాగబాబు, M.S. నారాయణ, ఆలీ, సుధ, సురేఖా వాణి తదితరులు

డైరెక్టర్ : పోసాని కృష్ణ మురళి

ప్రొడ్యూసర్ : నల్లం పద్మజ

రిలీజ్ డేట్ : 2009

పోసాని కృష్ణమురళి డైరెక్షన్ లో వచ్చిన డిఫెరెంట్ సినిమా పోసాని జెంటిల్ మెన్. తన భర్త జెంటిల్ మెన్ అని నమ్మే భార్య, తన భర్త నిజాయితీని తెలసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.