జీ సినిమాలు ( 15th నవంబర్ )

Tuesday,November 14,2017 - 10:06 by Z_CLU

నవ వసంతం

నటీనటులు  : తరుణ్, ప్రియమణి

ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : కె.షాజహాన్

ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి

రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007

తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం’. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో  సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్,  తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

==============================================================================

శివయ్య

నటీనటులు : రాజశేఖర్, సంఘవి, మోనికాబేడి

ఇతర నటీనటులు : చలపతి రావు, అశోక్ కుమార్, రమాప్రభ, AVS, అనంత్, గిరిబాబు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ లేఖ

డైరెక్టర్ : సురేష్ వర్మ

ప్రొడ్యూసర్ : డా. డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1998 మార్చి 27

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ శివయ్య. మోనికా బేడీ, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి సురేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో రవిబాబు విలన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు.

=============================================================================

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

 

భయ్యా

నటీనటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళనాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

=============================================================================

 

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన జై చిరంజీవహిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

=============================================================================

కౌసల్య రామ సుప్రజా

నటీనటులు : శ్రీకాంత్, చార్మీ

ఇతర నటీనటులు : శివాజీ, గౌరీ ముంజల్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కృష్ణ భగవాన్, L.B. శ్రీరామ్, చలపతి రావు, హేమ, సన తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : సూర్య ప్రసాద్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 2008 అక్టోబర్ 9

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తో రామానాయుడు గారు నిర్మించిన నాలుగో సినిమా కౌసల్యా సుప్రజా రామ. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకుడు.