డిసెంబర్ 29న నాగశౌర్య "ఛలో" రిలీజ్

Wednesday,November 15,2017 - 11:10 by Z_CLU

“ఊహ‌లు గుస‌గుస‌లాడే”, “దిక్కులు చూడ‌కు రామ‌య్య‌”, “ల‌క్ష్మిరావే మా ఇంటికి”, “క‌ళ్యాణ‌వైభోగం”,” జ్యోఅచ్చుతానంద‌” లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. ఈ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఛలో. న‌వంబ‌ర్‌ 18న ఛలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఛలో చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు.

నాగశౌర్ శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.


ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయిన రష్మిక మండన్న.. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అవుతోంది. దర్శకుడు వెంకీ కుడుముల గతంలో త్రివిక్రమ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు.