జీ సినిమాలు ( 15th ఫిబ్రవరి )

Thursday,February 14,2019 - 10:03 by Z_CLU

గురుబ్రహ్మ

నటీనటులు : R. మాధవన్, రితిక సింగ్

ఇతర నటీనటులు : ముంతాజ్ సార్కర్, రాధా రవి, M.K. రైనా, జాకీర్ హుసేన్, కాళి వెంకట్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

డైరెక్టర్ : సుధా కొంగర

ప్రొడ్యూసర్ : S. శశికాంత్, రాజ్ కుమార్ హిరాని

రిలీజ్ డేట్ : 29 జనవరి 2016

హిందీ బ్లాక్ బస్టర్ సాలాఖడూస్కి తెలుగు వర్షన్ గురుబ్రహ్మ. మాధవన్ ఈ సినిమాలో బాక్సర్ కోచ్ లా నటిస్తే రితిక వరల్డ్ చాంపియన్ షిప్ కోసం, బాక్సింగ్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్ లా నటించింది. ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితులు, గెలుపు ఓటముల మధ్య క్రియేట్ అయ్యే ఇమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

==============================================================================

రంగుల రాట్నం

నటీనటులు : రాజ్ తరుణ్శుక్లా

ఇతర నటీనటులు : సితారప్రియదర్శి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల

డైరెక్టర్ : శ్రీరంజని

ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

=============================================================================

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

=============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

============================================================================

నన్ను దోచుకుందువటే

నటీనటులు : సుధీర్ బాబు, నభా నతేష్

ఇతర నటీనటులు : నాజర్, రాజశేఖర్, వైవా హర్ష, చలపతి రావు, జీవ, బాబ్లో పృథ్విరాజ్, వర్షిణి సుందరాజన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీష్ లోక్ నాథ్

డైరెక్టర్ : R.S. నాయుడు

ప్రొడ్యూసర్ : సుధీర్ బాబు

రిలీజ్ డేట్ : 20 సెప్టెంబర్ 2018

కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించిఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.

ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్ తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రిమేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.

ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూషార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్ ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడుతండ్రిని ఎలా మెప్పించాడుతను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.

==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.