జీ సినిమాలు ( 21st ఫిబ్రవరి)

Thursday,February 20,2020 - 10:02 by Z_CLU

పంచాక్షరి

నటీనటులు అనుష్క శెట్టిచంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్ప్రదీప్ రావత్రవి ప్రకాష్బ్రహ్మానందందివ్యవాణితెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుందినిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

_____________________________________

మహా శివరాత్రి

నటీనటులు : మీనారాజేంద్ర ప్రసాద్సాయి కుమార్
ఇతర నటీనటులు శ్రీధర్ఆనంద వేలుఉమేష్శ్రీ లలితశ్రియఅనురాధ తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీశైల
డైరెక్టర్ రేణుకా శర్మ
ప్రొడ్యూసర్ : K. శ్రీహరి
రిలీజ్ డేట్ : 2000

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్డైలాగ్ కింగ్ సాయికుమార్మీనా నటించిన మహా శివరాత్రి సినిమాకి రేణుకా శర్మ డైరెక్టర్. భక్తి సినిమా తరహానే అయినా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది మహా శివరాత్రి.

______________________________________________

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రాశిఖన్నా

ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీరాజేంద్ర ప్రసాద్కబెర్ దుహాన్ సింగ్రవి కిషన్సాయి కుమార్మురళీ మోహన్తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : అనిల్ రావిపూడి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన  సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

___________________________________________

 

చూడాలని ఉంది

నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ : అశ్విని దత్

రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998

తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

___________________________________________

నేను లోకల్

నటీనటులు : నాని, కీర్తి సురేష్

ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017

బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

_______________________________

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్కార్తీకమోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణేబ్రహ్మానందంవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీకమోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెర్ఫార్మెన్స్శేఖర్ చంద్ర మ్యూజిక్కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.