మాస్ రాజకీయ నాయకుడిగా సూర్య

Thursday,February 14,2019 - 02:42 by Z_CLU

సూర్య అప్ కమింగ్ మూవీ NGK. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజయింది.  రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సూర్య రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

‘నా పేరు నందగోపాల కృష్ణ’ అని బిగిన్ అయ్యే ఈ టీజర్ ఒక కామన్ మ్యాన్, పాలిటిక్స్ లోకి రావాలని ఎందుకు అనుకుని ఉంటాడు..’ అనే క్యూరియాసిటీని  చేస్తుంది. ఇక మాస్ సీక్వెన్సెస్ లో సూర్య ఎలా కనిపిస్తాడనేది ఆడియెన్స్ కి కొత్త కాదు. సాయి పల్లవి చెప్పే “గోపాలా పోరా నాన్నా నువ్వెళ్తే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది” అనే డైలాగ్ తో సినిమాలో మరిన్ని చాలెంజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.

 

శ్రీరాఘవ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి S.R. ప్రకాష్ బాబు, S.R.  ప్రభు ప్రొడ్యూసర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.