'జెర్సీ' ఫస్ట్ సింగిల్' అందరికీ నచ్చేసింది

Friday,February 15,2019 - 10:20 by Z_CLU

నాని జెర్సీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. ఈ సినిమా నుండి   ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్స్ ని బట్టి ఆల్మోస్ట్ సినిమా క్రికెట్ చుట్టూ ఉంటుందనే వైబ్స్ క్రియేట్ అయితే, ‘అదేంటో గాని ఉన్నపాటుగా…’ అంటూ సాగే  ఈ సాంగ్ మాత్రం సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. దానికి తోడు నాని, అనిరుద్ ల కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా. ఆ ఫ్రెష్ నెస్ కొత్తగా అనిపిస్తుంది.

కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ సినిమాలోని లీడ్ రోల్స్ మధ్య ఉండే కెమిస్ట్రీని ఎలివేట్ చేస్తున్నాయి. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ సాంగ్, యూత్ కి స్ట్రేట్ గా రీచ్ అవ్వడమే కాదు, సినిమాపై మరింత పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఈ లిరికల్ వీడియోలో ఉన్న ఇమేజెస్ లో నాని స్టైలిష్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాని వైడ్ రేంజ్ లో ప్రమోట్ చేయనున్నారు మేకర్స్. సినిమా రిలీజయ్యే లోపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్  రిలీజ్ కానున్నాయి. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమాలో. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తున్నాడు.