జీ సినిమాలు (10th జూలై)

Sunday,July 09,2017 - 10:06 by Z_CLU

ఆదివిష్ణు

హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ

ఇతర నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు,  ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ

సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ

దర్శకత్వం – భరత్ పారేపల్లి

విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్  లో పేరుతెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక  స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.

==============================================================================

సూరిగాడు

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

పదహారేళ్ల వయసు

హీరోహీరోయిన్లు – చంద్రమోహన్, శ్రీదేవి

ఇతర నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల – 1978, ఆగస్ట్ 31

అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్  అయిన 16-వయతనిళ్లే సినిమాకు  రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు. చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

==============================================================================

ఓకే ఓకే 

హీరో హీరోయిన్లు – ఉదయనిధి స్టాలిన్, హన్సిక

ఇతర నటీనటులు – శరణ్య, సంతానం

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎమ్.రాజేష్

విడుదల తేదీ – 2012, ఆగస్ట్ 31

తమిళనాట భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా మారి చేసిన మొట్టమొదటి చిత్రం ఓకే ఓకే. బాగా డబ్బు ఉంది. తలచుకుంటే ఎలాంటి డైరక్టర్ ను అయినా ఒప్పించి ఓ మాస్ మసాలా భారీ బడ్జెట్ సినిమా చేయగలడు ఉదయ్ నిధి స్టాలిన్. కానీ కథపై నమ్మకంతో.. తనే నిర్మాతగా ఉంటూ, హీరోగా మారి ఓ కామెడీ రొమాంటిక్ సినిమాతో అరంగేట్రం చేశాడు. ఉదయ్ నిధి స్టాలిన్ నమ్మకం వమ్ముపోలేదు. ఓకే ఓకే సినిమా తమిళనాట బ్రహ్మాండంగా ఆడింది. 2012 సూపర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. హన్సిక అందాలు ఈ సినిమాకు ఒక ఎత్తయితే… ఉదయ్-సంతానం కలిసి పండించిన కామెడీ సినిమాకు బ్యాక్ బోన్. అటు హరీష్ జైరాస్ కూడా తన సంగీతంతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు.

==============================================================================

పాండు రంగడు

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

==============================================================================

 

గ్రీకు వీరుడు

నటీ నటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

==============================================================================

  

కలియుగ పాండవులు

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.