సుక్కు స్కూల్ నుండి కొత్త దర్శకులు

Tuesday,September 11,2018 - 10:02 by Z_CLU

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ లో నిర్మాతలుగా మారి శిష్యులను ఎంకరేజ్ చేస్తున్న వారి పేర్లు వేళ్ళ మీద చెప్పెయొచ్చు. అందులో సుకుమార్ ఒకరు.. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్థాపించి తనతో కలిసి పనిచేసిన రచయితలు సూర్య ప్రతాప్, జక్కా హరి ప్రసాద్ లను దర్శకులుగా ప్రోతహించిన క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు ఇప్పుడు తన శిష్యుల కోసం మరోసారి నిర్మాతగా రంగంలోకి దిగుతున్నాడు.

సుకుమార్ దగ్గర కొన్నేళ్లుగా దర్శకత్వ శాఖలో అలాగే రచయితగా పరిచేస్తున్న బుచ్చి బాబు అతి త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు సుక్కు.  ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉండగా సుకుమార్ మరో శిష్యుడు కాశి విశాల్ కూడా దర్శకుడిగా మారబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా విజయదశమికి లాంచ్ కానుంది.

ఈ సినిమాకు సుకుమార్ నిర్మాత కాకపోయినా సినిమా పూర్తయ్యే వరకూ బ్యాక్ బోన్ గా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి శిష్యుల కోసం నిర్మాతగా బిజీ అయిపోయాడు సుకుమార్. వీరి బాటలోనే సుకుమార్ శిష్యులు శీను , వెంకీ కూడా త్వరలోనే డైరెక్టర్స్ గా తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. సో త్వరలోనే సుకుమార్ శిష్యులు  డైరెక్టర్స్ గా మారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నరన్నమాట.