ఏకంగా 6 సినిమాలు రిలీజ్

Tuesday,September 11,2018 - 11:59 by Z_CLU

వినాయక చవితి పండగ కారణంగా లాంగ్ వీకెండ్ కలిసిరావడంతో ఈ వీకెండ్ ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ కు ముస్తాబయ్యాయి. వీటిలో అంచనాల మధ్య వస్తున్న సినిమాలు రెండే. రేపట్నుంచి 14వ తేదీ వరకు వరుసగా రిలీజ్ అవుతున్న ఆ సినిమా సంగతులేంటో చూద్దాం

6 సినిమాల్లో ముందుగా థియేటర్లలోకి వస్తున్న మూవీ ‘ఎందుకో ఏమో’. నందు, నోయల్, పునర్నవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రేపే (సెప్టెంబర్ 12) రిలీజ్ అవుతోంది. కోటి దర్శకత్వంలో ట్రయాంగిల్
లవ్ స్టోరీగా తెరకెక్కింది ఈ సినిమా

వినాయక చవితి కానుకగా, భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది శైలజారెడ్డి అల్లుడు చిత్రం. సెప్టెంబర్ 13న (గురువారం) వరల్డ్ వైడ్ విడుదలకానున్న ఈ సినిమాలో నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ
నటించింది. పాటలు ఇప్పటికే హిట్. ట్రయిలర్ ఇంకా పెద్ద హిట్. అందుకే వినాయక చవితి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది శైలజారెడ్డి అల్లుడు

శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో పాటు అదే రోజున (సెప్టెంబర్ 13) థియేటర్లలోకి వస్తోంది యూ-టర్న్. సమంత లీడ్ రోల్ చేసిన ఈ సినిమా కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఎంతో ఇష్టపడి సమంత అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసింది. సమంతకు సపోర్టింగ్ గా ఆది, రాహుల్ రవీంద్రన్, భూమిక లాంటి క్రేజ్ ఉన్న నటులు యూటర్న్ లో ఉన్నారు.

మసక్కలి అనే మరో చిన్న సినిమా కూడా వినాయక చవితికే వస్తోంది. సాయి రోనక్, శ్రావ్య, శిరీష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుందంటోంది యూనిట్. కాన్సెప్ట్ మాత్రం
బయటపెట్టడం లేదు. సినిమా చూస్తే మాత్రం షాక్ అవుతారని ఊరిస్తోంది.

జనతా హోటల్ అనే డబ్బింగ్ మూవీ కూడా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ముస్తాబైంది. వినాయక చవితి మరుసటి రోజు (శుక్రవారం-సెప్టెంబర్ 14)న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మహానటితో పాపులర్ అయిన దుల్కర్ సల్మాన్, ఆల్రెడీ తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇద్దరూ మంచి నటులే కావడం, ఆల్రెడీ మలయాళంలో ఈ సినిమా హిట్ అవ్వడం ప్లస్ పాయింట్స్. తెలుగులో సురేష్ కొండేటి సమర్పిస్తున్నాడు.