KGF2, BEAST యష్ , విజయ్ పోటీ !

Tuesday,March 22,2022 - 12:44 by Z_CLU

Vijay ‘BEAST’ to clash with Yash’s ‘KGF chapter2’ !

కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘KGF ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. KGF సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి మరో నాలుగు రోజుల్లో ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వనుంది. ట్రైలర్ రిలీజ్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్.

అయితే యష్ సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా కూడా అప్పుడే రాబోతుంది. అవును కోలీవుడ్ స్టార్ విజయ్ ‘BEAST’ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. అంటే ‘KGF 2’ కంటే ఒక్క రోజు ముందే విజయ్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

నిజానికి కోలీవుడ్ లో విజయ్ పై చెయి సాధిస్తాడు అందులో సందేహమే లేదు. అలాగే శాండల్ వుడ్ లో యష్ దే పై చెయి అవుతుంది. కానీ మిగతా భాషల్లో మాత్రం KGF 2 కి భారీ క్రేజ్ ఉంది. దీనికి కారణం KGF భారీ విజయం సాధించడమే. కాకపోతే ఓవర్ సీస్ లో మాత్రం విజయ్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.  చూడాలి యష్ కి విజయ్ ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics