April Box Office - టాలీవుడ్ రివ్యూ

Monday,May 02,2022 - 03:11 by Z_CLU

Tollywood Boxoffice- April Review

కరోనా/లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేట్రికల్ సిస్టమ్ లైన్లో పడింది. ఆర్ఆర్ఆర్ తో మార్కెట్ మొత్తం సెట్ అయింది. కేజీఎఫ్2తో పీక్ స్టేజ్ కు చేరుకుంది. అలా ఏప్రిల్ నెలలో కూడా థియేటర్లు కళకళలాడాయి. మరి ఏప్రిల్ లో మెరిసిన సినిమాలేంటి? అంచనాలు అందుకోలేకపోయిన మూవీస్ ఏంటి ? ఏప్రిల్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ.

Mega-star-chiranjeevi-is-the-chief-guest-for-mishanimpossible-event-zeecinemalu

‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాతో ఏప్రిల్ బాక్సాఫీస్ మొదలైంది. తాప్సి లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాల్ని అందుకోలేకపోయింది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయతో మెప్పించిన దర్శకుడు స్వరూప్, ఈ సినిమాతో మాత్రం మెస్మరైజ్ చేయలేకపోయాడు.

ghani

ఇక ఏప్రిల్ 8న కథ కంచికి మనం ఇంటికి, గని, రెడ్డిగారింట్లో రౌడీయిజం, బరి, డస్టర్ లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ‘గని’. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. అల్లు అరవింద్ కొడుకు అల్లు బాబి ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమవ్వగా, కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు.

KGF 2 Yash still

ఏప్రిల్ 14 నుంచి బాక్సాఫీస్ కు ఊపొచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’, అన్ని ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయింది. యష్-ప్రశాంత్ నీల్ కలిసి మరోసారి మేజిక్ రిపీట్ చేశారు. గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. అయితే ఈ సినిమా కంటే ఒక రోజు ముందొచ్చిన బీస్ట్ మూవీ మాత్రం తెలుగులో ఫ్లాప్ అయింది.

ఇక ఏప్రిల్ 22న బొమ్మల కొలువు, ధర్మపురి, నాలో నిన్ను దాచానే సినిమాలు రిలీజ్ అవ్వగా, అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 28న వచ్చిన ‘కేఆర్కే’ సినిమా కూడా నిరాశపరిచింది. విజయ్ సేతుపతి, సమంత, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ.. టాలీవుడ్ ఆడియన్స్ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఇక ఏప్రిల్ నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ వచ్చింది ఆచార్య. చిరంజీవి-చరణ్ హీరోలుగా నటించిన ఈ మెగా మూవీ ఏప్రిల్ 29న రిలీజైంది. మరో వారం గడిస్తే ఈ సినిమా రిజల్ట్ పై పూర్తి స్పష్టత వస్తుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics