మహేష్ ఈ ఏడాది గ్యాప్ తీసుకుంటాడా?

Wednesday,March 18,2020 - 01:08 by Z_CLU

ఒక్కో ఏడాది స్టార్ హీరోలకు అనుకోని గ్యాప్ వస్తుంటుంది. ఆ గ్యాప్ వల్ల ఫ్యాన్స్ నిరాశ పడుతుంటారు. ఈ ఏడాది మహేష్ ఫ్యాన్స్ కి అలాంటి నిరాశే కలిగేలా ఉంది. అవును ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజై మూడు నెలలు గడుస్తున్నా ఇంత వరకూ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు మహేష్.

ఇంకా మహేష్ 27వ సినిమా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది.

ఈ లెక్కన చూస్తే మహేష్ డిసైడ్ అవ్వడానికి, సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా ఎటులేదన్నా రెండు నెలలపైనే పట్టేట్టు కనిపిస్తుంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’ స్టాటజీని ఫాలో అయి ఐదారు నెలల్లో మహేష్ షూటింగ్ ను ముగిస్తే తప్ప సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదు.

ఎక్కువ శాతం మాత్రం సూపర్ స్టార్ నుండి ఈ ఇయర్ గ్యాప్ రావడం పక్కా అనిపిస్తుంది. అదే జరిగితే ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తూ వస్తున్న మహేష్ లిస్టులో ఈ ఇయర్ మిస్ అయినట్టే.

ప్రస్తుతానికైతే మహేష్ చుట్టూ వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, పరశురాం లాంటి దర్శకుల పేర్లు తిరుగుతున్నాయి. వీళ్లలో ఎవరో ఒకర్ని ఫైనల్ చేసి, 5 నెలల్లో సినిమా పూర్తిచేస్తే ఓకే. లేదంటే ఈ ఏడాది మహేష్ ఫ్యాన్స్ కు డిసప్పాయింట్ మెంట్ తప్పదు.