SSMB28 మరో సారి విలన్ గా ?

Monday,February 13,2023 - 12:28 by Z_CLU

Jagapathi Babu playing villain role in SSMB28 ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 కి సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడని  సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది నటీ నటులను తీసుకున్నాడు త్రివిక్రమ్.  పెద్ద యాక్టర్స్ ను కొన్ని కీ రోల్స్ కి ఫిక్స్ చేసుకున్నాడు. విలన్ రోల్ కి జగపతి బాబు ను ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సమేత సినిమాలో క్రూరమైన విలన్ గా కనిపించాడు జగపతి బాబు. అలాగే మహేష్ Mahesh Babu  మహర్షి లో కూడా స్టైలిష్ విలన్ గా నటించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. అందుకే మళ్ళీ జగపతి బాబుతోనే విలన్ కేరెక్టర్ చేయించాలని డిసైడ్ అయ్యాడట త్రివిక్రమ్.

ఇటీవలే సారదీ స్టూడియోస్ లో సెట్ వేసి యాక్షన్ పార్ట్ ఘాట్ చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే , శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics