దయచేసి నా బర్త్ డే సెలబ్రేట్ చేయొద్దు

Wednesday,March 18,2020 - 12:49 by Z_CLU

స్టార్ హీరోల పుట్టినరోజును ఫ్యాన్స్ ఓ వేడుకలా చేసుకోవడం సహజమే. ఇక ఈ నెల 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేసి వేడుకలు మొదలెట్టారు మెగా ఫ్యాన్స్. మార్చ్ నెలను రామ్ చరణ్ బర్త్ డే మంత్ గా డిక్లర్ చేసి మరీ గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ ప్లాన్ చేసారు.

కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో పరిస్థితి బాగోకపోవడం వల్ల తన పుట్టినరోజు వేడుకలు చేయొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు చరణ్. తన బర్త్ డేను సెలబ్రేట్ చేసేకంటే.. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అదే తనకు పెద్ద బర్త్ డే గిఫ్ట్ అంటున్నాడు.