రేపటి వేడుకలు రద్దు చేసుకున్న మోహన్ బాబు

Wednesday,March 18,2020 - 01:19 by Z_CLU

రేపు మోహన్ బాబు పుట్టినరోజు. ఏటా అతడి బర్త్ డే ఘనంగా జరుగుతుంది. తిరుపతిలోని అతడి స్కూల్ లో పిల్లల మధ్య గ్రాండ్ గా పుట్టినరోజు చేసుకుంటారు మోహన్ బాబు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఫ్యాన్స్.. ఇలా అంతా కలిసి వేలల్లో ఎటెండ్ అవుతారు. కానీ ఈసారి మోహన్ బాబు వేడుకలకు దూరమయ్యారు.

కరోనా కారణంగా ఇంత మంది కలిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని భావించిన మోహన్ బాబు.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను వాయిదా వేసుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఎవరూ రావొద్దని, వేడకలు నిర్వహించొద్దని రిక్వెస్ట్ చేశారు.