‘జెర్సీ’ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా..?

Wednesday,April 24,2019 - 11:03 by Z_CLU

ఎక్కడ స్టార్ట్ అయిందో తెలీదు కానీ ఇండస్ట్రీలో కొద్దో గొప్పో కమర్షియల్ ఫార్ములా లేకపోతే సినిమా రిస్క్ జోన్ లో పడుతుందనే అభిప్రాయం ఉంది. అదిరిపోయే కామెడీ.. నెవర్ సీన్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్సెస్… నెక్స్ట్ ఏం జరుగుతుందా..? అనే స్థాయిలో సస్పెన్స్ ఎలిమెంట్స్…. ఇవీ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ డిసైడ్ చేస్తాయి. కానీ ‘జెర్సీ’లో ఇలాంటివి కనిపించవు. ఉన్నదల్లా ఫిక్షన్ కాదేమో అనిపించే రియల్ ఎమోషన్స్.

టాలీవుడ్ లో ‘జెర్సీ’ స్థాయి కథలు వెదకడానికి ఫిక్సయితే లెక్కలేనన్నీ కథలు బయటికి వస్తాయి. కానీ కమర్షియల్ ఫార్ములా మిస్సింగ్ అనే ఒక్క రీజన్ తో అవి అటకెక్కేశాయి. ఇంకో మాట చెప్పాలంటే ఎలాగూ అలాంటి సినిమా చేయం కదా, ఇక రాసుకోవడం కూడా అనవసరమే అన్నట్టుగా ఉంది దర్శకుల ధోరణి. కానీ ‘జెర్సీ’ ఒక్క సిక్స్ తో ట్రెండ్ ను తిరగరాసింది. భావోద్వేగాలతో కథలు రాసుకునే రైటర్స్ కు కొత్త శక్తి ఇచ్చింది.

‘జెర్సీ’ జస్ట్ సక్సెస్ మాత్రమే కాదు. అదొక రివొల్యూషన్. మంచి సినిమా అనిపించుకోవడానికి కమర్షియల్ ఫార్ములా కాదు అద్భుతమైన కథ ఉంటే చాలని నిరూపించింది జెర్సీ. దీంతో హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్న ఫిల్మ్ మేకర్స్ కూడా,  ఓ గొప్ప సినిమా చేసేద్దాం… అనే ఆలోచనలో పడ్డారు.  సో… ‘జెర్సీ’ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే.