స్పీడ్ మీదున్న అనిల్ రావిపూడి

Wednesday,April 24,2019 - 12:02 by Z_CLU

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ‘మహర్షి’ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేస్తోంది యూనిట్. చిన్న చిన్న గ్యాప్ తో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ ‘మహర్షి’ హంగామా నడుస్తుంది. అయితే ఈ ‘మహర్షి’ అప్డేట్స్ మధ్య అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా అదే స్థాయిలో బయటికి వస్తున్నాయి.

మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ ఇలా దొరికిందో లేదో, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర ను అప్రోచ్ అయ్యాడు. ఉపేంద్ర నుండి దృష్టి మళ్ళిందో లేదో, ఈ సినిమాతో విజయశాంతి రీ-ఎంట్రీ అని కన్ఫమ్ అయింది. అసలు ఎలాంటి సినిమా ప్లాన్ చేసి ఉంటాడు అనిల్ రావిపూడి అనుకునే లోపు, ఈ సినిమాలో బండ్ల గణేష్ కూడా నటిస్తున్నాడనే విషయం తెలిసింది. అదొకటేనా..? ఈ సినిమాలో అప్పుడే విలన్ కూడా ఫిక్స్ అయిపోయాడు. జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడు.

ఇంత ఫాస్ట్ గా పనులు కానిస్తున్నాడంటే అనిల్ రావిపూడి మహేష్ బాబు సినిమా కోసం ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నాడో అర్థమౌతుంది. మూవీ సెట్స్ పైకి వచ్చేలోపు ఇంకా ఎంతమందిని ఫిక్స్ చేస్తాడో!