ఫోకస్ లోకి గౌతమ్ తిన్ననూరి

Wednesday,April 24,2019 - 10:02 by Z_CLU

సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘జెర్సీ’. అప్పటివరకు జస్ట్ ఒక్క సినిమా దర్శకుడు అనిపించుకున్న గౌతమ్ తిన్ననూరిని ఒక్కసారిగా ఫోకస్ లోకి తెచ్చేసింది. జస్ట్ 2 సినిమాలతోనే గౌతమ్ సినిమాలు బావుంటాయి అని ముద్ర పడేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు.

‘మళ్ళీరావా’తో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఏ దర్శకుడైనా ఫస్ట్ సినిమాకి కొద్దో గొప్పో పాజిటివ్ టాక్ దక్కించుకున్నాడంటే ఆల్మోస్ట్ గట్టెక్కినట్టే. సెకండ్ సినిమా మాత్రం కంపల్సరీగా కమర్షియల్ ఆంగిల్ లోనే రెడీ చేసుకుంటాడు. గౌతమ్, నానితో సినిమా అనౌన్స్ చేసిన రోజు, అందరికీ కలిగిన ఫీలింగ్ అదే. కానీ గౌతమ్ మాత్రం కమర్షియల్ వాల్యూతో పాటు.. అద్భుతంగా ఎమోషన్స్ పండించే హీరోను సెలక్ట్ చేసుకున్నాడని జెర్సీ రిలీజైన తర్వాత తెలిసింది.

జెర్సీ సక్సెస్ తో ఇండస్ట్రీ టాప్ నిర్మాతల దృష్టిలో పడ్డాడు గౌతమ్. దీంతో ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ తో చర్చలు సాాగుతున్నాయని కొందరు, మరో పెద్ద హీరో కూడా లైన్లో ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. త్వరలోనే గౌతమ్ నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ బయటకు రాబోతున్నాయి.