అక్టోబర్ 5... ఏం జరగబోతోంది...

Saturday,October 01,2016 - 12:00 by Z_CLU

తన సినిమా విషయంలో క్రిస్టల్ క్లారిటీగా ఉంటాడు రాజమౌళి. సినిమా మేకింగ్ లోనే కాకుండా… ప్రమోషన్, పోస్ట్ ప్రొడక్షన్, విడుదలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజమౌళి చాలా ఓపెన్ గా ఉంటాడు. ఎలాంటి హైప్స్ లేకుండా అన్ని విషయాల్ని ముందుగానే మీడియాకు చెప్పేస్తాడు. తాజాగా బాహుబలి-2 విషయంలో కూడా అదేచేశాడు. కాకపోతే… ఒకే ఒక్క విషయంలో మాత్రం సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాడు రాజమౌళి. అదే అక్టోబర్ 5.

30thsep2016-2brand-copy123

అక్టోబర్ 5న అందరూ గర్వపడే వార్త చెబుతాం అంటున్నాడు రాజమౌళి. ప్రభాస్ అభిమానులే కాకుండా… మొత్తం సౌతిండియా ప్రేక్షకులంతా గర్వించే వార్తను అక్టోబర్ 5న చెబుతాం అంటున్నాడు. దానికి సంబంధించి ఎలాంటి క్లూ కూడా ఇవ్వలేదు రాజమౌళి. ఆరోజున ప్రభాస్ పెళ్లి కబురు ఏదైనా వినిపించబోతున్నారా అనే ప్రశ్నకు మాత్రం క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లికి, అక్టోబర్ 5కి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. అయినా బాహుబలి-2 విడుదలయ్యేంత వరకు ప్రభాస్ పెళ్లిచేసుకోడనే విషయాన్ని కూడా చెప్పేశాడు.

_iva77010056
మరి అక్టోబర్ 5న రాజమౌళి ఏం చెప్పబోతున్నాడనే అంశం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం… అది ఓవర్సీస్ లో బాహుబలి-2కు సంబంధించిన మేటర్ అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. మరోవైపు… అక్టోబర్ 5న బాహుబలి-1 కలెక్షన్లను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా… ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.