సందేహాలు - సమాధానాలు

Saturday,October 01,2016 - 12:09 by Z_CLU

బాహుబలి-2పై సందేహాలకు రాజమౌళి సమాధానాలు
అక్టోర్‌ 5న ప్రభాస్‌కు సంబంధించిన న్యూస్‌ ఏంటి? ప్రభాస్‌కు ఏమైనా ప్రఖ్యాత అవార్డు  వచ్చిందా….?
– అవార్డులకు సంబంధించిన న్యూస్‌ కాదండీ. మాకు ఆ న్యూస్‌ వచ్చినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో, మీరు అవ్వాలి. 5 న అందరికీ తెలుస్తుంది.

బాహుబలి 2 హైలైట్స్‌ చెప్పండి?
– ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను ముందుగానే ఓ పద్ధతి ప్రకారం రవీల్‌ చేసుకుంటూ వచ్చాను. అయితే బాహుబలికి సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పకూడదు, సినిమాలోనే చూడాలనేది నా అభిప్రాయం.

బాహుబలి2లో తమన్నా మీద సాంగ్స్‌ ఉంటాయా?
– సెకండాఫ్‌లో తమన్నా ఉంటుంది. కానీ ఆమె మీద పాటలు లేవు. అనుష్క ఇందులో హీరోయిన్‌. అనుష్క మీదనే పాటలు ఉంటాయి.
_iva77100064
యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యిందా ?
– సినిమా లో కీలకమైన క్లైమాక్స్‌ అయిపోయింది. గ్రాఫిక్స్‌ విషయంలో, మనుషుల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలిగాం. రెండున్నర నెలలు సమయం పట్టింది. ఎడిటింగ్‌ చేసి గ్రాఫిక్స్‌ చేశాం.

షూటింగ్‌లో ఇంకా ఏం చేయాల్సి ఉన్నాయి?
– రెండు పాటలు, చిన్న ప్యాచ్‌ వర్క్‌, ఒక చిన్న యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది.

ప్రభాస్‌, రాణా లను ఎప్పుడు విడిచి పెడతారు?
– డిసెంబర్‌ నెలలో రెండు వారాల్లో వారికి సంబంధించిన షూటింగ్‌ పూర్తవుతుంది. దాంతో ప్రభాస్‌,రాణా యే  కాదు, అందరూ ఆర్టిస్ట్‌లు రిలీజ్‌ అవుతారు.

బాహుబలి పార్ట్‌ 3 ఉంటుందా?
– బాహుబలి అనే మహావృక్షం నుంచి చాలా సినిమాలు వస్తాయి. సినిమా అనేది కొమ్మ మాత్రమే. బాహుబలి పార్ట్‌ 3 అనేది ఆన్‌ ద కార్డ్స్‌. అది ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేను.