బాహుబలి-2 షూటింగ్ అప్ డేట్స్

Saturday,October 01,2016 - 11:52 by Z_CLU

ప్రభాస్-రానా లీడ్ రోల్స్ చేస్తున్న బాహుబలి-2 సినిమా షూటింగ్ ప్రొగ్రెస్ ను రాజమౌళి ఎక్స్ క్లూజివ్ గా వివరించాడు. ఇన్నాళ్లూ సినిమాకు సంబంధించి కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తయిందని, అది కూడా క్లయిమాక్స్ లో వచ్చే కీలకమైన యుద్ధ సన్నివేశాల్ని మాత్రమే పూర్తిచేశారని అంతా అనుకున్నారు. కానీ బాహుబలి-2 షూటింగ్ దాదాపు పూర్తయిందని ప్రకటించాడు రాజమౌళి. 2 పాటలు, చిన్న యాక్షన్ సీక్వెన్స్, కొన్ని సీన్లు మాత్రమే బాకీ ఉన్నాయని ప్రకటించాడు. మరీ ముఖ్యంగా పెండింగ్ ఉన్న షూటింగ్ పార్ట్ దేనికీ గ్రాఫిక్స్ అవసరం లేదని… చకచకా షూటింగ్ అయిపోతుందని తెలిపాడు. పైగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పోర్షన్ కు ఎడిటింగ్ పూర్తిచేసి, గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ కు కూడా అందజేశామని రాజమౌళి స్పష్టంచేశాడు. సో… ఎంత తీరిగ్గా షూటింగ్ చేసుకున్నప్పటికీ… డిసెంబర్ చివరి నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని అంటున్నాడు రాజమౌళి. జనవరి నుంచి కంప్లీట్ గా ప్రమోషన్ కోసమే కేటాయిస్తున్నట్టు తెలిపాడు.