వీకెండ్ రిలీజెస్

Wednesday,March 27,2019 - 01:02 by Z_CLU

ఈ వారం 3 సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో ఒకటి నయనతార ‘ఐరా’ డబ్బింగ్ సినిమా, అందునా తక్కిన 2 సినిమాల కన్నా ఒకరోజు ముందుగా మార్చి 28 నే థియేటర్స్ లోకి వస్తుంది. నయనతారా డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా ఇది. హారర్ మూవీ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ సినిమా.

సూర్యకాంతం : మరీ భారీ బడ్జెట్ సినిమాలు చేయకపోయినా, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చేసే నిహారిక, ఈసారి కాస్తంత హైపర్ డోస్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ లో నటించింది. కామెడీ ఎలిమెంట్స్ తో సరదాగా సాగిపోయే సినిమా అని తెలుస్తుంది. 29 మార్చిన థియేటర్స్ లోకి వస్తుంది.

లక్ష్మీస్ NTR : రిలీజ్ కి ముందే గత నెల రోజులుగా, ప్రతి కార్నర్ లో ఈ సినిమా వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ వీకెండ్ మార్చి 29 న రిలీజవుతుంది లక్ష్మీస్ NTR. రెగ్యులర్ సినిమా ఫార్మాట్ లో కాకుండా, RGV మార్క్ తో  పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.